వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.కేవలం ఒకే ఒక్క ఎంపీ ఎంతగా ఇబ్బంది పెడుతున్నారని కానీ వైసిపి నాయకులు అందరిలోనూ ఉంది.
ఆయనను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తున్నా, అంతకు మించిన ప్లాన్ లతో రఘురామకృష్ణంరాజు వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు నిత్యం అనేక సమస్యలపై లేఖలు రాస్తూ ఎన్నికల హామీలను జగన్ నెరవేర్చాలి అంటూ హడావుడి చేస్తున్నారు ఈ పరిణామాలన్నీ వైసిపి రాజకీయ ప్రత్యర్ధులకు వరంగా మారాయి.దీంతో రఘు రామ వైసీపీ ప్రభుత్వం పై చేసే విమర్శ మనం హైలెట్ చేస్తూ టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన కొన్ని న్యూస్ ఛానళ్లు పేపర్లు మరింత హడావుడి చేస్తున్నాయి.
ప్రభుత్వంపై ఆయన చేసే విమర్శలకు మరింత ప్రచారం కల్పిస్తూ నిత్యం వాటి ని హైలెట్ చేస్తూ వస్తున్నాయి కానీ టిడిపి అనుకో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని సర్వసాధారణం వైసీపీకి చెందిన సాక్షి మీడియా సైతం రఘురామకృష్ణరాజు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఆయన చేసే విమర్శలకు వైసిపి నాయకులు ఇచ్చే కౌంటర్లను హైలెట్ చేస్తూ అనవసర ప్రచారం కల్పిస్తోంది.పెద్దగా రాజకీయ నేపథ్యం లేని రఘురామకృష్ణంరాజు మొదటిసారిగా ఎంపీగా గెలిచారు.
ఈ పదవి కాలం పూర్తయిన తరువాత ఆయన రాజకీయ భవిష్యత్తు పైన గందరగోళం నెలకొంది ఆయనకు ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అటువంటి వ్యక్తి చేసి విమర్శలను వైసిపి పట్టించుకోకుండా , వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటే కొద్దిరోజులు హడావిడి చేసినా ఆ తర్వాత సైలెంట్ అయిపోయి ఉండే వారు.కానీ అలా కాకుండా ఆయన విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రఘురామ తనకు తాను బలవంతుడిగా ఊహించుకుంటూ మరింతగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ,బలవంతుడిగా ఊహించుకుంటున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
.