జ‌గ‌న్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఇంగ్లీష్ ఆర్టిక‌ల్‌... సంచ‌ల‌న నిజాలు..!

దేశ‌వ్యాప్తంగా రైతులు ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే.కేంద్రం తాజాగా తెచ్చిన కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాం డ్ చేస్తున్నారు.

 Ycp Mla English Article On Ys Jagan, Ap Cm, Ys Jagan, Ycp Mla, English Article,-TeluguStop.com

మ‌రి ఈ సెగ ఏపీలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.దీనికి కార‌ణం ఏంటి?  రైతులు ఏపీలో ఎందుకు సంతోషంగా ఉన్నారు ?  ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే.ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి రాసిన ఆంగ్ల వ్యాసం.ఈ ఆర్టిక‌ల్లో ఆయ‌న జ‌గ‌న్‌ది నిజ‌మైన రైతు ప్ర‌భుత్వంగా ఎందుకు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌ను స‌వివ‌రంగా చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అనేక కీల‌క సంస్క‌ర‌ణ‌లు రైతుల‌కు మేలు చేస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.ప్ర‌ధానంగా రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ల విష‌యంలో ఇత‌ర రాష్ట్రాల‌కు భిన్నంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ తీసుకోని నిర్ణ‌యం.రైతు భ‌రోసా కేంద్రాలేన‌ని అబ్బ‌య్య చౌద‌రి వెల్ల‌డించారు.మొత్తం.10641 రైతు భ‌రోసా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు.వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను రైతు భ‌రోసా కేంద్రాల‌తో అనుసంధానం చేయడం ద్వారా.రైతుల పంట ఉత్ప‌త్తులకు మ‌ద్ద‌తు ధ‌ర‌లు ద‌క్కేలా చ‌ర్య‌లు తీసుకుంటారు.అదేస‌మ‌యంలో సాగు మెళ‌కువ‌లు కూడా నేర్పిస్తారు.ఇక‌, విత్త‌నాల కొనుగోలు నుంచి పంట‌ల సాగులో ప్ర‌తిద‌శ‌లోనూ ఆర్బీకేలు రైతుల‌కు అన్ని విధాలా సాయం చేస్తుండ‌డంతో రైతుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మ‌స్య‌లు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయాయ‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.

Telugu Abbaya Chowdary, Ap Cm, Ap, Godavari, English Article, Krishna, Ycp Mla,

గ‌తంలో ఇలాంటి నిర్ణ‌యాల‌ను రాష్ట్రంలో ఏ ప్ర‌భుత్వ‌మూ తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.ఇక‌, రైతుల‌కు బ‌హిరంగ మార్కెట్‌లో నిర్ణీత‌.మ‌ద్ద‌తు ధ‌ర‌లు ల‌భించ‌క‌పోతే.ప్ర‌భుత్వ‌మే రైతు భ‌రోసా కేంద్రాల నుంచి మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు పంట‌ల‌ను కొనుగోలు చేసేలా కూడా సీఎం జ‌గ‌న్ చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నారు.అంతేకాదు, మ‌ద్ద‌తు ధ‌ర‌లు ఇచ్చేలా.రూ.3200 కోట్ల‌తో ప్ర‌త్యేక నిధిని కూడా ఏర్పాటు చేశారు.అంతేకాదు,.

విప‌ణిలో రైతు ఉత్ప‌త్తుల‌కు మార్కెట్ పెంచుకు నేలా.పోటీ త‌త్వం పెరిగేలా కూడా జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.

దీంతో రైతులు.ఇప్పుడు ఏవ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో తాము న‌ష్ట‌పోతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారో.

ఏ మ‌ద్ద‌తు ధ‌ర‌ల కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారో.ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం.

ఏపీ ప్ర‌భుత్వం.ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏనాడో చూపించార‌ని.

ఇదే ఏపీ రైతుకు నిజ‌మైన భ‌రోసా అని ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి కొనియాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube