ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటిని దర్శకధీరుడు.తెలుగులో ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలే.
ఇంకా చెప్పాలంటే ఓటమి ఎరుగని దర్శకుడు.ఇప్పటి వరకు ఆయన ఏ సినిమా ఫ్లాక్ కాలేదు అనుకుంటాం.
కానీ అందులో వాస్తవం లేదని చెప్పుకోవచ్చు.ప్లాపులే తెలియని దర్శకుడి సినిమాల్లో ఫ్లాపులేంటి అనుకుంటున్నారా? అయితే సినిమా విజయం విషయంలో చాలా అంశాలుంటాయి.అటు కొన్ని సినిమాల విషయంలో బడ్జెట్ కి.విజయానికి పొంతన ఉండదు.రాజమౌళి సినిమాలకు సంబంధించి ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు.
సై

నితిన్ – జెనీలియా హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా సై.రగ్బీ క్రీడ కేంద్రంగా ఈ సినిమా నడిపించాడు దర్శకుడు రాజమౌళి.అయితే నితిన్ కు అప్పట్లో అంత మార్కెట్ లేకపోవడం, జెనీలియా అప్పుడప్పుడే సినిమాల్లోకి రావడం సినిమాకు మైనస్ అయ్యాయి.అటు సినిమా కథ ఫర్వాలేదు అనిపించినా.ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసినా అనుకున్నంత స్థాయిలో కమర్షియల్గా వర్కవుట్ కాలేదని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఛత్రపతి

రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన సినిమా ఛత్రపతి, ఈ సినిమా విషయంలోనూ కాస్ట ఫెల్యూర్ అయినట్లు ప్రచారం జరిగింది.నిజానికి ఛత్రపతి సినిమా ఫ్లాప్ కాలేదు.కానీ అనుకున్నంత స్థాయిలో వసూళ్లు సాధించలేదు.నిర్మాతకు లాభాలు వచ్చినా.అనుకున్నంత స్థాయిలో రాలేదని టాక్ నడిచింది.
యమదొంగ

రాజమౌళి, జూ.ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా యమదొంగ.అప్పట్లో ఓ అద్భుత విజయం సాధించింది ఈ సినిమా.
ఈ సినిమా పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్.అయితే ఈ సినిమా విషయంలోనూ కాస్ట్ ఫెయిల్యూర్ జరిగినట్లు వార్తలు వచ్చాయి.చేసిన ఖర్చుకు వచ్చిన వసూళ్లకు పొందన లేదనే ఆరోపణలు వినిపించాయి.
సింహాద్రి

అటు జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ద్వయంలో వచ్చిన మరో మూవీ సింహాద్రి.ఈ సినిమా విజయం సాధించినా.ఖర్చు విషయంలో తడిసి మోపెడు అయ్యిందనే ఆరోపణలు వచ్చాయి.
అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలని కొట్టి పారేశారు సినిమా సిబ్బంది.