ఈ మధ్య కాలంలో కొందరు ప్రేమ, వివాహం వంటి విషయాలలో అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయాల కారణంగా తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కాగా తాజాగా బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఎంపీ తన భర్తతో తెగదెంపులు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని లోక్ సభ మెంబర్ ఎంపీ “నుష్రత్ జహన్” తన భర్త నిఖిల్ జైన్ తో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.దీంతో ఈ విషయంపై తాజాగా నుష్రత్ జహన్ స్పందిస్తూ తామిద్దరం తమ మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నప్పటికీ చట్టబద్ధం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అంతేకాకుండా తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపింది.అలాగే నుష్రత్ జహన్ పలు వ్యక్తిగత అంశాలు మరియు తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన భర్తతో విడిపోయిన విషయాన్ని కొంతకాలం పాటు గోప్యంగా ఉంచానని కూడా తెలిపింది.
దీంతో నుష్రత్ జహన్ మరోమారు సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే నుష్రత్ జహన్ మొదటగా పలు సీరియళ్లు మరియు సినిమాలలో నటిగా బాగానే రాణించింది.ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి 2019 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది.కానీ తన వ్యక్తిగత జీవితంలో చిక్కులు ఏర్పడడంతో గత కొద్ది కాలంగా పలు సమస్యలను ఎదుర్కొంటోంది.