అగ్ర రాజ్యం అమెరికా రోజు రోజుకు వ్యాక్సినేషన్ విషయంలో వినూత్న ప్రయోగాలు చేస్తూ విమర్సల పాలవుతోంది.ప్రజలను వ్యాక్సినేషన్ వేసుకోమని ప్రోశ్చహించే ఓపిక లేని ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేసుకునే వారికి తాయిలాలు ఇస్తామని ప్రకటించడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది.
ఆరోగ్యంపై శ్రద్ద ఉన్న వాళ్ళు తప్పకుండా వేయించుకుంటారు కదా వ్యాక్సిన్ దొరకక ఎన్నో దేశాలలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇదేంటి అమెరికాలో వ్యాక్సిన్ వేసుకోమని బ్రతిమిలాడుతూ, కాళ్ళు పట్టుకోవదానికైన సిద్దం అన్నట్టుగా ప్రభుత్వం ఈ తరహా తాయిలాలు ప్రకటించడం ఏంటి అనుకుంటున్నారా.అందుకు కారణం లేకపోలేదు.
బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రధమంగా కరోనా మహమ్మారి విరుగుడు వ్యాక్సిన్ పైనే దృష్టి పెట్టారు.అమెరికా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు.
తన ఎన్నికల హామీలల్లో ఇదే ప్రధమంగా నిలిచింది కుడా.అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో అమెరికన్స్ వ్యాక్సిన్ పై ఆసక్తిని కనబరిచినా క్రమ క్రమంగా వ్యాక్సిన్ వేసుకోవడంపై ఆసక్తి కనబరచలేదు.
ఈ క్రమంలోనే అధ్యక్షుడు బిడెన్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జులై 4 సమయానికి 70 శాతం మంది పెద్దలకు వ్యాక్సిన్ అందించేలా టార్గెట్ పెట్టుకున్నారు.అయితే ఈ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో అమెరికాలోని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేలా వింత ధోరణిని ప్రదర్శిస్తున్నాయి.కొన్ని రోజుల క్రితం వ్యక్సిన్ వేసుకునే వారికి బిడెన్ బీర్ లు ఉచితంగా ఇస్తామని ప్రకటించగా, మరి కొన్ని చోట్ల ఉచితంగా భోజనం ఇస్తామని, మరి కొందరు చికెన్ జాయిట్ లు ఫ్రీ అంటూ ప్రకటనలు చేశాయి.తాజాగా వాషింగ్టన్ ప్రభుత్వం ఓ వింత ప్రకటన చేసింది.
వ్యాక్సిన్ లు తీసుకునే వారికి గంజాయి ఉచితంగా ఇస్తామని లైసెన్స్ ఉన్న స్టోర్ లకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం, 21 ఏళ్ళు దాటినా వారు ఎవరైనా సరే వ్యాక్సిన్ వేసుకోగానే గంజాయి ఉచితంగా తీసుకోండి అంటూ బిడెన్ టార్గెట్ పూర్తి చేయడం కోసం గంజాయి ఫ్రీగా ఇస్తోంది.అయితే ఈ విషయంపై నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు.
వ్యాక్సిన్ టార్గెట్ కోసం ఇంతకు బరితెగించాలా అంటూ ఫైర్ అవుతున్నారు.