జాన్సన్ అండ్ జాన్సన్ టీకాని ఆమోదించిన కువైట్..!

కరోనా నియంత్రణకు మరో అత్యవ్సర టీకాకు ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి కువైట్ ఆరోగ్య శాఖ ఆమోదించింది.

 Kuwait Government Green Signal For Johnson And Johnson Vaccine, Corona , Vaccine-TeluguStop.com

వ్యాక్సిన్ పై అన్ని ట్రయల్స్ పూర్తయ్యాయని సమాచారం.వ్యాక్సిన్ సేఫ్టీ, క్వాలిటీ, పనితీరుపై పూర్తి సమీక్ష రావడంతో డ్రగ్ కంట్రోల్ అండర్ సెక్రటరీ డా.అబ్దుల్లా అల్ బదేర్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.టెక్నికల్ మినిస్ట్రీ కమిటీ కూనా కూడా వ్యాక్సి సమర్ధతపై సమీక్ష నిర్వహించారని తెలిపారు.

ఆ కమిటీ కూడా ఈ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ పై పాజిటివ్ నివేదిక అందిచిందని తెలుస్తుంది.అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అబ్దుల్ బదేర్ చెప్పారు.

వ్యాక్సిన్ వినియోగం వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా ఆరోగ్య శాఖ దగ్గర నుండి గమనించినట్టు చెప్పారు.అన్ని పరిశోధనలు చేసిన తర్వాతనే ఈ టీకా ఎమర్జెన్సీ వినియోగానికి ఆమోదించడం జరిగిందని చెప్పారు.

మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలతో వ్యాక్సిన్ సరఫరా విషయంపై కువైట్ ప్రభుత్వం చర్చలు జరిపీంది.సంబంధిత ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.ఈ ఏడాది చివరి త్రమాసికంలో ఈ వ్యాక్సిన్ కువైట్ కు అందించేలా ఒప్పందం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube