స్టార్ హీరో బన్నీ చాలా ప్రతిభ ఉన్న నటుడనే సంగతి తెలిసిందే.నటుడిగా సినిమాసినిమాకు ఎదుగుతూ విజయాలను సొంతం చేసుకుంటున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించారు.
దర్శకుడు త్రివిక్రమ్ కెరీర్లో సైతం ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమాలో నటించిన నటుడు హర్షవర్ధన్ బన్నీలోని టాలెంట్ కు సంబంధించిన విషయాన్ని వెల్లడించారు.
అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ హర్షవర్ధన్ తో “మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్” అనే డైలాగ్ ను చెబుతారు.అయితే ఆ డైలాగ్ స్క్రిప్ట్ లో లేదని బన్నీ స్పాట్ లో ఆ డైలాగ్ ను ఇంప్రూవ్ చేశారని హర్షవర్ధన్ చెప్పారు.
బన్నీ మొదట త్రివిక్రమ్ కు ఆ డైలాగ్ చెప్పగా ఆయన టాప్ లేచిపోయేలా నవ్వారని హర్షవర్ధన్ అన్నారు.ఆ తరువాత బన్నీ ఆ డైలాగ్ ను తనకు చెప్పడానికి వస్తే త్రివిక్రమ్ ఆపేశారని తెలిపారు.
మొదట స్క్రిప్ట్ ప్రకారం మీరు సూపర్ సార్ అనే డైలాగ్ చెప్పాలని కానీ ఆ డైలాగ్ కు బదులుగా మరో డైలాగ్ ను అల్లు అర్జున్ చెప్పడంతో తాను నిజంగానే షాకయ్యానని హర్షవర్ధన్ అన్నారు.ఆ షాట్ సింగిల్ టేక్ లో ఓకే అయిందని హర్షవర్ధన్ తెలిపారు.
ఫేస్ బుక్ లో ఒక మీమ్ ను చూసి ఆయన ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు.ఆ డైలాగ్ ను ఇప్పుడు మీమ్స్ కోసం ఉపయోగించుకుంటున్నారని హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు.

అమృతం సీరియల్ ద్వారా హర్షవర్ధన్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.హర్షవర్ధన్ పలు సినిమాల్లో నటించడంతో పాటు కొన్ని సినిమాలకు మాటల రచయితగా పని చేశారు.బన్నీలో కూడా మంచి డైలాగ్ రైటర్ ఉన్నారని హర్షవర్ధన్ తన పోస్ట్ ద్వారా తెలియజేశారు.