టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే శోకసంద్రంలో మునిగిపోయారు.తన ఫేవరెట్ టీచర్ మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
జెసికా దరువాలా అనే టీచర్ పూజా హెగ్డేకు చదువు చెప్పారు.పూజా హెగ్డే ఢిల్లీలో ఉన్న మానెక్ జీ కూపర్ స్కూల్ లో చదువుకున్నారు.
టీచర్ మరణించిన వార్త తెలిసిన వెంటనే పూజా హెగ్డే తన ఇన్ స్టాగ్రామ్ లో కన్నీటి పర్యంతమవుతూ పోస్ట్ పెట్టడం గమనార్హం.
టీచర్ గొప్పదనం గురించి పూజా హెగ్డే చెబుతూ ఎవరైనా ఆమె చదువు చెప్పిన స్కూల్ లో చదువుకుని ఉంటే ఆ టీచర్ యొక్క గొప్పదనం అర్థమయ్యేదని పూజా హెగ్డే అన్నారు.
టీచర్ మృతి చెందిన విషాదాన్ని తాను తట్టుకోలేకపోతున్నానని పూజా హెగ్డే పేర్కొన్నారు.టీచర్ గురించి చెబుతూ ఈ ప్రపంచం ఒక రత్నాన్ని కోల్పోయిందని ఆమె వెల్లడించారు.తాను ఎప్పుడు నిరాశకు లోనైనా టీచర్ ధైర్యం చెప్పేవారని తెలిపారు.

టీచర్ ధైర్యంగా ఉండటానికి చెప్పిన మాటలు తనకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయని పూజా హెగ్డే పేర్కొన్నారు.టీచర్ మేలిమి బంగారం అంటూ స్టూడెంట్ గా చదివిన కాలం నాటి విషయాలను ఆమె గుర్తు చేసుకున్నారు.తను ఈ స్టేజ్ కు రావడానికి టీచర్ ఒక విధంగా కారణమని పేర్కొన్నారు.
టీచర్ కుటుంబ సభ్యులకు పూజా హెగ్డే సంతాపాన్ని తెలియజేశారు.ఆమె ఎన్నో జీవిత పాఠాలను నేర్పించారని పూజా హెగ్డే పేర్కొన్నారు.
జెసికా టీచర్ జియోగ్రఫీ బోధించేవారని పూజా హెగ్డే వెల్లడించారు.తన సక్సెస్ కు కారణమైన టీచర్ మాటలను ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.మరోవైపు పూజా హెగ్డే నటించిన సినిమాలు కొన్ని రోజుల గ్యాప్ లో విడుదల కానున్నాయి.వరుస విజయాలతో జోరుమీదున్న పూజా హెగ్డే మరిన్ని సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.