తన ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..ఎంతో తెలుసా?

మెగాబ్రదర్ నాగబాబు అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, పవన్ కళ్యాణ్ అన్నగా సినిమా పరిశ్రమలోకి ఎన్ట్రీ ఇచ్చినా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు దక్కినంత స్టార్ స్టేటస్ దక్కలేదు.

 Nagababu Who Gave Clarity On His Assets Do You Know Much, Actor Nagababu, Viral-TeluguStop.com

అయితే కొన్ని కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో నటించి సహాయ నటుడుగా మంచి పేరు తీసుకొచ్చుకున్నాడు.అయితే ఇటు నటుడుగా సినిమాలలో నటిస్తూనే నిర్మాతగా మారిన మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు.

అది కాక నిర్మాతగా మారిన తరువాత చాలా ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి ఉంది.అయితే పవన్ కళ్యాణ్, చిరంజీవి తనను ఆర్థిక కష్టాల నుండి గట్టెకించారని ఇప్పటికీ నాగబాబు చెబుతారు.

ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు చాలా విషయాలను సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటారు.

అయితే కొన్ని కొన్ని వివాదాస్పదమైనప్పటికీ ఇంకా అలానే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఈ మధ్య తరచుగా ఆస్క్ యువర్ క్వశ్చన్ అని కొత్త కార్యక్రమం ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు.అయితే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాగబాబు ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నీకు ఎంత ఆస్తి ఉంది అని అభిమాని నాగబాబుని ప్రశ్న అడిగాడు.అయితే ఆ సదరు అభిమానికి సమాధానంగా నువ్వు నన్ను నీకు అని ఏకవచనంతో సంభోదించావు కనుక నీ ప్రశ్నకు సమాధానం చెప్పను, ఒక వేళ నువ్వు నన్ను మీరు అని సంభోదించి ప్రశ్న అడిగి ఉంటే నా ఆస్తిలో సగం నీకు రాసి ఇచ్చే వాడినని సెటైరికల్ గా సమాధానమిచ్చాడు.

అయితే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతోంది.ఇక నాగబాబు అభిమానులు సరిగ్గా సమాధానమిచ్చారంటూ నాగబాబును అభినందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube