ప్రస్తుతం అంతా నడిచేది మొత్తం సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఇంటర్నెట్ యుగం కొనసాగుతున్న పరిస్థితులలో ఫోన్ అనేది ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారిపోయింది.
ఒకప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే కంప్యూటర్ లో మాత్రమే మనకు కావలసిన సమాచారం దొరికేది కాని ఇప్పుడు పరిస్థితి అప్పటి పరిస్థితికి పూర్తి భిన్నముగా తయారయింది.ఇప్పుడు ప్రపంచమంతా ఫోన్ లోనే కనబడుతోంది.
ఫోన్ ద్వారా చేసే కార్యకలాపాల ద్వారా కొన్ని వేల కోట్ల టర్నోవర్ జరుగుతుందంటే ఇప్పుడు మనిషి జీవితంలో ఫోన్ ఎంత ముఖ్యమైన సాధనంగా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు.అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న మీ ఫోన్ ను అకస్మాత్తుగా ఓ పక్షి గోడ మీద ఉంచిన ఫోన్ ను వచ్చి ఎట్టుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది.
ఏదో కామెడీ అనుకుంటున్నారా.అచ్చం ఇలాగే ఓ యువతి ఫోన్ ను ఓ పక్షి అమాంతంగా ఎత్తుకెల్లిపోయింది.
ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఈ వార్తపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
అయితే ఎవరికో ఫోన్ చేయాలని తీసుకెళ్లినట్టుంది తీసుకొస్తుంది లే అని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.కొందరైతే తినే వస్తువు అని భావించినట్లు ఉంది అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
.