పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా వకీల్ సాబ్.దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా పింక్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధానంగా సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొనే వేధింపులు, అత్యాచారం వంటి సమస్యల మీద కథాంశం ఉంటుంది.
ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలుగా అంజలి, నివేదా, అనన్యా కనిపించగా వారి తరుపున వాదించే లాయర్ గా పవన్ కళ్యాణ్ నటించారు.ఇదిలా ఉంటే పింక్ సినిమాకి పూర్తి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా కథని తెరపై ప్రెజెంట్ చేశారు.
సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఏపీలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు రద్దు చేయడంతో పాటు ఎన్నికలలో వకీల్ సాబ్ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున రిలీజ్ వాయిదా వేయాలని వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.
దీనిపై నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్ చేసింది.
మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎవరు చేసినా ఎంకరేజ్ చేయాలి.కానీ ఈ డిఫేమింగ్ ఆర్గనైజ్డ్ ట్రెండ్ ఏంటో? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్ళు రాజకీయాలు? అమ్మాయిలను డిఫేమ్ చేసి రాజకీయాలు చేస్తే తప్పు కాదు.అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లెమ్ ఎవరికి.ప్రెస్ మీట్ పోసాని గారూ అని పేర్కొంది.అంతేకాక సినిమా మరియు రాజకీయాల మధ్య ఏర్పాటు చేసిన వివాహం యొక్క వ్యవస్థీకృత సంబంధం అనేది సంబంధిత వ్యక్తులకు కాకుండా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి.రెండూ ఒకరికొకరు కలిసి జీవించలేరు.
కానీ కాపురం చెయ్యకపోతే ఫీల్ అయ్యేది చూస్తున్న జనాలు.కుళ్లు రాజకీయాలు మానేయాలి” అని మరో ట్వీట్ చేసింది.