కొన్ని సార్లు అందివచ్చిన అవకాశాన్ని వదులుకుంటాం.ఆ తర్వాత అనవసరంగా వదులుకున్నాం అని బాధపడుతాం.
అయినా జరిగిన నష్టాన్ని పూడుకోలేం.అలాంటి అవకాశాన్ని చేచేతులా వదులుకున్నారు హీరోలు ఎన్టీఆర్, అల్లూ అర్జున్.
ఇంతకీ వాళ్లు వదులుకున్న అవకాశం ఏంటి? ఎందుకు ఆ తర్వాత బాధపడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం!
కొన్ని సినమాలు మాస్ ఆడియెన్స్‌కు నచ్చుతాయి.మరికొన్ని క్లాస్ ప్రేక్షకులు ఆదరిస్తారు.
ఇంకొన్ని సినిమాలను యూత్ ఎంకరేజ్ చేస్తారు.కానీ.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది బొమ్మరిల్లు సినిమా.ఈ సినిమా ఆరోజుల్లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
భారీ వసూళ్లను రాబట్టింది.
బొమ్మరిల్లు సినిమా డైరెక్టర్ భాస్కర్.
కొత్త దర్శకుడు.మంచి కథ రెడీ చేసుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్, అల్లూ అర్జున్ను కలిసి తన కథ వినిపించాడు.ఈ కథతో మంచి హిట్ సాధించవచ్చని చెప్పాడు.
కానీ కొత్త దర్శకుడు కావడంతో వారు ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు.చివరకు సిద్ధార్థను హీరోగా ఫైనల్ చేశాడు నిర్మాత దిల్ రాజు.
హీరోయిన్గా జెనీలియాను ఓకే చేశారు.ఆగష్టు 2009లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.6 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా 25 కోట్ల రూపాయలను సాధించింది.బాక్సాఫీస్ రికార్టులను కొల్లగొట్టింది.
బొమ్మరిల్లు సినిమాకు మంచి వసూళ్లతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి.ఈ చిత్రానికి 7 నంది అవార్డులు దక్కాయి.3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.ఈ సినిమా నాలుగు భాషల్లోకి రీమేక్ అయ్యింది.
ఈ మూవీ తమిళంలో సంతోష్ సుబ్రమణ్యం పేరుతో విడుదల అయ్యింది.బెంగాళీలో భలోబాసా భలోబాసా పేరుతో రిలీజ్ అయ్యింది.
ఒరియాలో డ్రీమ్ గర్ల్ పేరుతో రూపొందింది. హిందీలో ఇట్స్ మై లైఫ్ పేరుతో రూపొందించారు.
అన్ని భాషల్లోనూ ఈ సినిమా చక్కటి విజయాన్నిఅందుకుంది.
ఒకానొక సమయంలో హీరోలు ఎన్టీఆర్, అల్లూ అర్జున్.
ఈ సినిమాను అనవసరం కాదనుకున్నాం అని సన్నిహితుల దగ్గర అన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.