తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో బిజెపి – జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో బిజెపి పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనేక జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు బిజెపి పార్టీ అభ్యర్థి రత్నప్రభ ఇంకా పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని గౌరవించాలని ప్రధాని మోడీ స్వయంగా తెలిపారని పేర్కొన్నారు.
ఆయన ఈ రాష్ట్రానికి అధిపతి అని ఆయన సూచించారు అని చెప్పుకొచ్చారు.
ఇదే తరుణంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పరిపాలన వైఫల్యాలను ఖచ్చితంగా ఎండగట్టాలని జన సైనికులకు పిలుపునిచ్చారు.జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలలో కూటమి అభ్యర్థి విజయం కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
అంతేకాకుండా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని స్పష్టం చేశారు.రెండు పార్టీలకు చెందిన కేడర్ ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా ముందుకు సాగాలని అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని సూచించార.