పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణమండపం లో బుధవారం రాత్రి 8,9,10,11,12,19,20,21,22,23,24 వార్డుల వాలంటీర్ల సేవలకు సంబంధించి నిర్వహించిన సేవావజ్ర,సేవారత్న,సేవామిత్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయటానికి వాలంటీర్ వ్యవస్థను తీసుకు వచ్చారన్నారు అలాగే ప్రజలకు త్వరగా సేవలను అందించాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ ను తీసుకు వచ్చారన్నారు వాలంటరీ వ్యవస్థ ద్వారా వారు ప్రభుత్వం తో భాగస్వామ్యం అయ్యామని భావిస్తున్నారని అన్నా రు.
ఇలాంటి వ్యవస్థ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు .మీ పనితీరు కూడా ప్రజలలో మంచి పేరు తీసుకు వస్తుంది అన్నారు.దీనితో ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి సేవా పురస్కారాలు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు.దీని వల్ల మీలో ఉత్సాహం వచ్చి ప్రజలకు మరింత సేవలను అందిస్తారని భావిస్తున్నామన్నారు.మేము ప్రజలలోకి వెళ్లి వాలంటీర్ల పనితీరు గురించి అడిగితే ప్రజలు మీకు అభినందనలు తెలుపుతున్నారన్నారు.మీరు ఇదే స్ఫూర్తితో పని చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు ప్రభుత్వం ఎప్పుడు మీ సేవలను మర్చిపోదన్నారు.







