యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగ్‌దే’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.అంతేగాక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
కాగా ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ‘రంగ్ దే’ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
రంగ్ దే కథ విషయానికి వస్తే, చిన్నప్పటినుండి అను(కీర్తి సురేష్), అర్జున్(నితిన్)లకు అస్సలు పడదు.దీంతో వారు పెద్దవారయ్యాక కూడా ఇదే తరహాలో పోట్లాడుతూ వస్తుంటారు.
ఒకరంటే మరొకరికి పడదు.అయితే అనుకోని సంఘటన కారణంగా అనుని అర్జున్ పెళ్లి చేసుకుంటాడు.
ఇక అక్కడి నుండి వారిద్దరి మధ్య నడిచే ట్రాక్ ఎలా ఉంటుంది? అనుని అర్జున్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అసలు అను అంటే అర్జున్‌కు ఎందుకు కోపం? చివరికి వారిద్దరు ఏమవుతారు? అనేది సినిమా కథ.
కాగా రంగ్ దే చిత్రంపై సినిమా యూనిట్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి.ఆయన ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను నితిన్‌కు అందించడం ఖాయమని చిత్ర యూనిట్ భావించింది.కానీ, రొటీన్ కథను సరికొత్త ఎమోషన్స్‌తో చూపించే ప్రయత్నంలో దర్శకుడు విఫలమవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక హీరోహీరోయిన్ల మధ్య నడిచే ట్రాక్‌ను కూడా దర్శకుడు పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేయలేకపోయాడు.అటు సంగీతం పరంగా కూడా సినిమాలో ఒక్క హిట్ సాంగ్ కూడా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి.
అయితే ఈ సినిమాలో నటీనటుల విషయంలో నితిన్ అల్ట్రా స్టైలిష్ లుక్, కీర్తి సురేష్ అభినయం ఈ సినిమాకు బలంగా మారాయి.కామెడీతో ఈ సినిమాను నెట్టుకొద్దామని ప్రయత్నించినా, సెకండాఫ్‌లో ఎమోషన్స్ ఎక్కువ మొత్తంలో ఉండటంతో ఈ సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువయ్యాయి.దీంతో ఈ సినిమా కూడా యావరేజ్ మూవీగా నితిన్ కెరీర్‌లో మిగిలిపోయింది.
చివరగా:
రంగ్ దే – నితిన్ ఆశలపై రంగు పడింది.!
రేటింగ్:
2.5/5.0