ప్రస్తుతం సమాజంలో ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం కావాలంటే ఇరుగు పొరుగువారిని అడిగి తెలుసుకునే రోజులు పోయి ఇప్పుడు అంతా మొబైల్ ఫోన్ లోనే తెలుసుకునే రోజులు వచ్చేశాయి.ప్రశ్న ఏదైనా సరే సమాధానం చిటికెలో మీ ముందు పెట్టేందుకు అంతర్జాలంలో ఎన్నో రకాల వెబ్సైట్స్ రెడీ అయిపోయాయి.
ఇందులో ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కువ శాతం ప్రజలు ఏదైనా సమాచారాన్ని అడిగి తెలుసుకోవాలంటే ముందుగా ఆశ్రయించే సెర్చ్ ఇంజన్ గూగుల్.ఇక అసలు విషయంలోకి వెళితే.
మనలో చాలామందికి శృంగారం విషయంలో అనేక రకాల అనుమానాలు కలిగి ఉండటంతో పాటు అనేక సందేహాలు కూడా ఉంటాయి.అయితే ఈ విషయాలన్ని మనం తల్లితండ్రులతో గాని స్నేహితులతో కూర్చుని చర్చించే పరిస్థితి లేకపోవడంతో దాంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు అంతర్జాలాన్ని ఉపయోగించి తెలుసుకోవడం మొదలు పెట్టేశారు.
అందులో ముఖ్యంగా గూగుల్ సెర్చ్ ఇంజన్ పై పూర్తిగా ఆధారపడి పోతున్నారు.ముఖ్యంగా మనకు తెలియని సమాచారాన్ని గూగుల్ సెర్చ్ ఇంజన్ లో సెర్చ్ చేసి సమాధానాన్ని చిటికలో తెలుసుకోగలుగుతారు.
అయితే తాజాగా ఓ సంస్థ చేపట్టిన సర్వే విభాగంలో శృంగార విషయంలో అనేకమంది ఆ సమయంలో ఆ అనుభూతి ఎలా ఉంటుంది ? అలాగే ఎలా ఆస్వాదిస్తారు ? అన్న విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నట్లు గూగుల్ తెలిపింది.వీటితోపాటు కలల్లో శృంగారం రకమైన కలలు వస్తే వాటి అర్థం ఏమిటి ?! ఇలా రకరకాల విచిత్రమైన ప్రశ్నలు గూగుల్ లో వెళ్లడం ఎక్కువైందని అందులో ముఖ్యంగా 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు చేస్తున్నట్లు సమాచారం.వీటితోపాటు శృంగారం చేయడానికి అతి సులువైన మార్గాలు ఏమిటి ? అలాగే శృంగారం చేసే సమయంలో ఎలాంటి గాయాలు ఏమైనా అవుతాయా ? లేకపోతే ఒకవేళ గాయాలైతే వాటి నుంచి ఎలా బయట పడవచ్చు ? లాంటి రకరకాల ప్రశ్నలు గూగుల్ లో వెతకడం ఎక్కువ అయిపోయింది.ఇక అమ్మాయిల విషయానికి వస్తే శృంగారం చేస్తే శరీరంలో ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయి ? అలాగే శృంగారంలో పాల్గొన్న తర్వాత ఎన్ని రోజులకు గర్భం ధరిస్తారు? లాంటి ప్రశ్నలు వెతుకుతున్నట్లు గూగుల్ తెలిపింది.