ఏంటి... తొందర్లోనే రకుల్ పాప కూడా టాలీవుడ్ కి గుడ్ బై చెప్పనుందా....?

తెలుగులో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “రకుల్ ప్రీత్ సింగ్” గురించి టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కొంత మేర అవకాశాల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వరుసగా పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకొని కొంతకాలం పాటు స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందింది.

 Is Rakul Preet Singh Saying Good Bye To The Tollywood In Soon, Rakul Preet Singh-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో సినిమా అవకాశాలు కరువైనట్లు కొందరు తెగ చర్చించుకుంటున్నారు.

కాగా ఆ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో మన్మధుడు 2, ఎన్జికే, దేవ్, చెక్, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.

దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడి సినిమా కెరియర్ పై పడింది.ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశాలను కూడా కోల్పోయింది.

దీనికి తోడు ఈ అమ్మడు పారితోషికం విషయంలో కూడా బెట్టు చేస్తుండడంతో కొందరు దర్శక నిర్మాతలు సినిమా ఆఫర్ల విషయంలో ఆలోచిస్తున్నారు.

Telugu Rakulpreet, Telugu-Movie

దీంతో విషయం అర్థం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మెల్లమెల్లగా వ్యాపారాలపై దృష్టి సారించింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తూ బాగానే రాణిస్తోంది.అంతేకాకుండా పలు రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెడుతూ బాగానే సంపాదిస్తోంది.

ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల పై ఆసక్తి చూపిస్తోంది.ఇందులో భాగంగా ఇప్పటికే బాలీవుడ్ లో దాదాపుగా మూడు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

దీంతో అన్నీ కుదిరితే ఈ అమ్మడు కూడా తొందరలోనే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో “అటాక్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

అలాగే హిందీలో “థ్యాంక్ గాడ్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ఆ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

కాగా తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ఆగిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube