మా నాన్న పోలీస్ ఆఫీసర్... అందుకే సినిమాల్లోకి వెళతానంటే...

సినిమా పరిశ్రమ అనేది యూనివర్సల్ రంగం ఇక్కడ రాణించాలంటే ప్రతిభ ఉంటే చాలు చదువు, సంధ్యలు, డబ్బు మరియు ఇతర అంశాలు పెద్దగా పని చేయవు అయితే గతం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది కనీసం పది కూడా పాస్ కానీ నటీనటులు స్టార్ డమ్ ను అనుభవిస్తున్నారు.అయితే తాజాగా ఈ కథలో పాత్రలు కల్పితం అనే చిత్రం ద్వారా యంగ్ హీరోయిన్ మేఘన టాలీవుడ్ సినిమా పరిశ్రమకి పరిచయం కాబోతోంది.

 Tollywood Upcoming Actress Meghna About Her Struggles Before Film Industry, Ee K-TeluguStop.com

కాగా తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తాను సినిమా పరిశ్రమకి ఏ విధంగా వచ్చాననే విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తన తల్లిదండ్రులు తనను చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ గా పెంచారని చెప్పుకొచ్చింది.

అలాగే తన తండ్రి పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడని దీంతో మొదటగా తాను సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా వెళ్తానంటే వద్దన్నారని తెలిపింది.ఆతరువాత తనకు నటనపై ఉన్నటువంటి ఆసక్తిని గమనించి చదువులు పూర్తయిన తర్వాత వెళ్ళమని ప్రోత్సహించారట.

దాంతో తాను కూడా తన తల్లిదండ్రులు చెప్పిన విధంగానే చదువులు పూర్తి చేసి సినిమా పరిశ్రమకు వచ్చానని తెలిపింది.అలాగే చిన్నప్పటి నుంచే తనకు సినిమాల్లో నటించాలని చాలా ఆసక్తిగా ఉండేదని ఆ ఆసక్తిని తన వృత్తిగా మలచుకుని ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.

Telugu Eekadhalo, Meghana, Telugu-Movie

ఇప్పటి వరకు తాను ఎలాంటి చిత్రాలలో లేదా లఘు చిత్రాలలో నటించలేదని మొదటిసారిగా ఈ కథలో పాత్రలు కల్పితం అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం కాబోతున్నానని తెలిసింది.ముఖ్యంగా తాను ముందుగా అనుకున్న విధంగానే చిత్ర కంటెంట్ మరియు ఇతర అంశాలు నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించానని తెలిపింది.అంతేకాకుండా ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది.అయితే తాను కొంతమేర టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి ఇంద్రజను పోలి ఉంటానని దాంతో కొందరు నటీనటులు ఈ విషయాన్ని గమనించి అప్పుడప్పుడూ తనతో చెబుతుంటారని కూడా చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube