వంగ‌వీటి మ‌న‌సంతా అక్క‌డే... ఎర్త్ ఎవ‌రికో ?

ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు చాలా నిస్తేజంగా ఉన్న కొంద‌రు నేత‌ల‌ను చాలా యాక్టివ్ చేశాయి.ఈ లిస్టులోనే మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా వ‌చ్చి చేరారు.

 Vangaviti Manasanta There Earth Anyone, Ap, Ap Political News, Latest News, Vang-TeluguStop.com

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఆయ‌న ఆ పార్టీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేశారు.గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి త‌ర్వాత ఇర‌వై నెల‌ల‌కు పైగా రాజకీయంగా ఏ మాత్రం యాక్టివ్‌గా లేని వంగవీటి రాధా ఇప్పుడు విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేళ చాలా యాక్టివ్ అవ్వడం రాజ‌కీయ వ‌ర్గాల‌కు కూడా అంతు ప‌ట్ట‌డం లేదు.

రాధా సెంట్ర‌ల్లో ఉన్న 21 డివిజ‌న్ల‌లో అయితే టీడీపీని లేదా జ‌నసేన అభ్య‌ర్థుల‌ను మాత్ర‌మే గెలిపించాల‌ని ప్ర‌చారం చేశారు.

గ‌త ఎన్నికల్లో వైసీపీ నుంచి త‌న సెంట్ర‌ల్ సీటును మ‌ల్లాది విష్ణు లాగేసుకున్నార‌న్న బాధ రాధాకు ఇప్ప‌ట‌కీ ఉంది.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏ పార్టీ నుంచి అయినా సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేసి మ‌ళ్లీ అసెంబ్లీకి వెళ్లాల‌న్న బ‌ల‌మైన కోరిక‌తో ఉన్నారు.రాధాకు సెంట్ర‌ల్‌పై ఏ మాత్రం మ‌మ కారం పోలేద‌ని అంటున్నారు.

వ‌చ్చే ఎన్నికల వేళ ఆయ‌న టీడీపీ నుంచి ఈ సీటు ఆశిస్తారు.మొన్న ఎన్నిక‌ల‌లో ఎలాగూ సీటు త్యాగం చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు రాక‌పోతే జ‌నసేన78 నుంచి అయినా పోటీ చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న అనుచ‌రులే చెపుతున్నారు.

టీడీపీ గెలిచి ఉంటే రాధాకు ఎమ్మెల్సీ వ‌చ్చి ఉండేది.

మ‌రో నాలుగేళ్ల త‌ర్వాత కానీ ఆయ‌న టీడీపీలో ఉంటే ఎమ్మెల్సీ రాదు.ఒక వేళ సెంట్ర‌ల్ సీటు ఆయ‌న అడిగితే బాబు ఖ‌చ్చితంగా బొండా ఉమాకే ఇస్తారు.

పైగా గ‌త ఎన్నిక‌ల్లో బోండా కేవ‌లం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు.సెంట్ర‌ల్ సీటు కోసం రాధా పట్టుబ‌ట్టినా బాబు ఖ‌చ్చితంగా ఉమాకే ఇస్తారు.

ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల వేళ సెంట్ర‌ల్ సీటుపై క‌న్నేసే రాధా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ యాక్టివ్ అయ్యారంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube