మోసం చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే.అందులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురిని మోసం చేసినవాడు తప్పించుకోవడం అసాధ్యం.
దేని గురించి ఈ మ్యాటర్ అని ఆలోచిస్తున్నారా! అదేనండీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ను ఛీటింగ్ చేసిన కేటుగాళ్ల గురించి.
ఇక ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఢిల్లో పోలీసులు హర్షితను మోసం చేసిన వారిలో ముగ్గుర్ని అరెస్ట్ చేశారట.
ఇకపోతే ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా అతని తోడు దొంగలైన సాజిద్, కపిల్, మన్వేంద్ర అనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
ఇకపోతే గత వారం క్రితం సెకండ్ హ్యాండ్ సోఫాను ఆన్ లైన్ లో హర్షిత అమ్మేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమెను వీరు రూ.34 వేల మేరకు మోసం చేశారు.వీరిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు త్వరగానే ఈ కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చారు.
మరి సీయం కూతురి మ్యాటర్ అంత తేలికగా వదిలేస్తే ఎలా.ఇక ఆ మోసగాళ్లకు తెలియదు కావచ్చూ తామూ ముఖ్యమంత్రి కూతురితో పెట్టుకుంటున్నామని.అందుకే ఇప్పుడు వీపులు సాపు చేసుకుంటున్నారు.