కంగనాతో ఒప్పందాలు రద్దు చేసుకున్న బడా కంపెనీలు

బాలీవుడ్ లో కొంత మందితో ఫైర్ బ్రాండ్ అనిపించుకుని మరికొంత మంది దగ్గర వివాదాస్పద హీరోయిన్ అనే గుర్తింపు కలిగి ఉన్న అందాల భామ కంగనా రనౌత్.ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ అదే స్థాయిలో ఫీమేల్ సెంట్రిక్ కథలతో సినిమాలు చేస్తున్న కంగనా రనౌత్ తన నటనతో ఎంత గొప్ప నటి అనిపించుకుందో అదే స్థాయిలో తన మాటలతో, వివాదాస్పద వాఖ్యలతో అంతే స్థాయిలో విమర్శలకి గురవుతుంది.

 Companies Broke Advertising Contract With Kangana Ranaut, Bollywood, Bollywood C-TeluguStop.com

ఎప్పుడూ ఏదో అంశం మీద, ఎవరో ఒకరి మీద నోటికొచ్చినట్లు కామెంట్స్ పెట్టడం కంగనాకి ఒక అలవాటుకి మారిపోయిందని ఇప్పుడు బిటౌన్ లో మెజారిటీ సెలబ్రెటీలకి ఉన్న అభిప్రాయం.ఈ కారణంగానే ఆమెతో వాదించేందుకు ఎవరూ కూడా పెద్దగా ఇష్టపడరు.

సెలబ్రెటీ కుటుంబాల నుంచి వచ్చే వారసులని కూడా టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు చేస్తుంది.అలాగే రాజకీయ అంశాల మీద కూడా రచ్చ చేస్తుంది.

బీజేపీ సానుభూతి పరురాలైన కంగనా ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం గురించి వివాదాస్పద వాఖ్యలు చేసింది.

ఆ ఉద్యమంలో పాల్గొన్నవారు ఉగ్రవాదులు, దేశద్రోహులు అంటూ కామెంట్స్ చేసింది.

ఈ మాటలపై రైతు నాయకులు, పలు రాజకీయ, సామాజిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అయినా కూడా ఆమె తన మాటలకి కట్టుబడి ఉంది.

ఇదిలా ఉంటే తన మాటల కారణంగా కొన్నిబడా కంపెనీలు తనతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకున్నారని కంగనా తెలియజేసింది.నేను ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రమోషన్ లు, ఐటెం సాంగ్స్ చేయను, పెద్ద హీరోల సినిమాలలో నటించను.

ఇప్పుడు నాతో పెద్ద కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి.అయినా కానీ నేను తక్కువ సంపాదించిన ప్రతిఫలం ఎక్కువగానే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube