టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా నిన్న విజయవాడ గొల్లపూడి సెంటర్ వద్ద హడావిడి చేసిన సంగతి తెలిసిందే.మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దీక్షకు దిగటంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఆ తర్వాత బయటకు వచ్చిన దేవినేని ఉమా వైసిపి పార్టీ పై అదేవిధంగా మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఇదిలా ఉంటే తాజాగా సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై కూడా సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి జగన్ ఏమి సాధించారని ఘాటుగా ప్రశ్నించారు.పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే రీతిలో అపహాస్య పాలన చేస్తున్నట్లు విమర్శించారు. జగన్ పాలన లో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేకాటరాయుళ్ల ను పట్టుకున్న ఎస్ ఐ ఆత్మహత్య చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరించిందని దేవినేని ఉమ ఆరోపించారు.అంతే కాకుండా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం కాకుండా వైసీపీ పార్టీ కోసం పని చేస్తున్నట్లు ఉందని దేవినేని ఉమ ఘాటైన విమర్శలు చేశారు .