సాధారణంగా ప్లేయర్స్ ఆటలు ఆడేటప్పుడు ఏదైనా పొరపాటున లేక కావాలనే తప్పు జరుగుతే వాటికి తగ్గట్టు పెనాల్టీ, లేదా కొన్ని మ్యాచులకు దూరంగా ఉండే విధంగా అధికారులు కొన్ని కటిన నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం సహజం.ఈ తరుణంలోనే ఒక ఫుట్బాల్ ప్లేయర్ పై రెడ్ కార్డ్ పెనాల్టీ వేయడం జరిగింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
బార్సిలోనా సాకర్ స్టార్ ఆటగాడు, ప్రపంచ స్థాయిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న మెస్సీపై రెండు మ్యాచుల నిషేధం విధించారు.
స్పానిష్ సూపర్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా ప్రత్యర్థి జట్టు ఆటగాడిని చేతితో తీవ్రంగా గాయపరిచినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ మ్యాచ్ లో భాగంగా గోల్డ్ పోస్ట్ వైపు వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది.
అథ్లెటిక్ బిల్బావో ఫుట్బాల్ ప్లేయర్ ను చేతితో మెస్సీ చాలా గట్టిగా కొట్టడు.దీనితో అతడు అక్కడే మైదానంలో కుప్పకూలిపోయాడు.వాస్తవానికి ఇలాంటి తప్పిదాలకు దాదాపు 12 మ్యాచ్ ల వరకు నిషేధం విధించే అవకాశం కనపడుతుంది.అయితే ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించని ఫుట్ బాల్ సమాఖ్య తక్కువ పెనాల్టీ విధించి అక్కడితోనే సరిపెట్టుకుంది.
ఇక ఆ జట్టు తరఫున మెస్సీ దాదాపు 753 మ్యాచ్ లు ఆడగా.అందులో ఎన్నడూ కూడా రెడ్ కార్డ్ తీసుకోకుండా తనదైన రితిలో ఆట కొనసాగించేవాడు.
కానీ, మొట్టమొదటిసారి రెడ్ కార్డు తీసుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.