దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ సినిమాల ద్వారా హీరో ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా మార్కెట్ పెరగడంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే.బాహుబలి తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో నటిస్తున్నారు.
కేవలం నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నారు.
ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఈ ఏడాది సమ్మర్ లో మొదలు కానుండగా 2022 సంవత్సరం ఆగష్టు 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
అయితే ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఒక ఇంటర్వూలో పాల్గొన్న ఓం రౌత్ ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖలు చేశారు.

ప్రభాస్ లేకపోతే ఆదిపురుష్ సినిమానే లేదని ఓం రౌత్ అన్నారు.ప్రభాస్ ఆది పురుష్ సినిమా కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రభాస్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోకపోతే మాత్రం తాను ఈ సినిమాను ప్రారంభించే వాడిని కాదని ఆయన ఆన్నారు.ప్రభాస్ పై ఓం రౌత్ ప్రశంసల వర్షం కురిపించారు.ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ప్రభాస్ ఈ రెండు సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.మరోవైపు ప్రభాస్ హీరోగా ఇప్పటికే షూటింగ్ పూర్తైన రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.