బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ విన్నర్ కాగా అఖిల్ రన్నర్ అయ్యారు.కొన్ని రోజుల క్రితం అఖిల్ తనకు ఒక మంచి ఆఫర్ వచ్చిందని త్వరలో ఆ ఆఫర్ కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని అన్నారు.
అయితే తెలుస్తున్న సమాచారం మేరకు అఖిల్ కు గోపీచంద్ సినిమాలో అవకాశం వచ్చిందని సమాచారం.గత మూడు సీజన్ల కంటెస్టెంట్లకు బిగ్ బాస్ షో వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరకపోయినా ఈ సీజన్ లో మాత్రం కంటెస్టెంట్లకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా సెకండాఫ్ లో కీలక పాత్రలో అఖిల్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అఖిల్ నటిస్తాడని అయితే అతని పాత్ర పరిధి తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.యాక్షన్ హీరో గోపీచంద్ సినిమాలో ఛాన్స్ అంటే అఖిల్ కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
అయితే అఖిల్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.అఖిల్ బిగ్ బాస్ షో రన్నర్ గా నిలిచినా అతనికి బిగ్ బాస్ నుంచి ఎటువంటి ఫ్రైజ్ మనీ రాలేదు.
అయితే బిగ్ బాస్ షో తన కెరీర్ కు ప్లస్ అవుతుందని భావించిన అఖిల్ కు అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.