వైరల్: అతడికి ఇమ్రాన్‌ హష్మీ, సన్నీ లియోని తల్లిదండ్రులట..!

తాజాగా బీహార్ రాష్ట్రానికి ఓ కళాశాల విద్యార్థి కాస్త వెరైటీగా ఆలోచించి తన తల్లిదండ్రుల పేర్లు ఉండాల్సిన చోట మరొకరి పేర్లు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.తాజాగా ఓ కళాశాల విద్యార్థి తన తల్లిదండ్రుల పేరు రాయాల్సిన చోట తల్లి పేరుగా సన్నీలియోని, తండ్రి పేరు వద్ద ఇమ్రాన్ హస్మి అంటూ దరఖాస్తులు పేర్కొన్నాడు.

 Sunny Leone, Emraan Hashmi, Parents, Viral News,bihaar,mujafarpoor,kundan Kumar,-TeluguStop.com

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

ముజఫర్ పూర్ కి చెందిన కుందన్ కుమార్ అనే 20 సంవత్సరాల యువకుడు డిగ్రీ కాలేజీలో బి.ఏ రెండో సంవత్సరం చదువు అభ్యసిస్తున్నాడు.అయితే అతడు పరీక్షల కోసం అప్లై చేసుకునే దరఖాస్తు ఫామ్ లో అతడు తప్పుడు వివరాలతో హాల్ టికెట్ కు దరఖాస్తు చేశాడు.

ఆ అప్లికేషన్ ఫామ్ లో తల్లి పేరు వద్ద సన్నీలియోని, తండ్రి పేరు వద్ద ఇమ్రాన్ హస్మి అనే పేర్లను ఉపయోగించాడు.అయితే ఇవి సినిమా తారల పేర్లలా అనిపించడంతో అతడికి వచ్చిన హాల్ టికెట్ కాస్త వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఈ హాల్ టికెట్ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ విషయం సంబంధించి తాజాగా సన్నిలియోన్ సోషల్ మీడియా ద్వారా చమత్కారంగా రిప్లై ఇచ్చింది.

ఇందులో భాగంగా ‘ఈ పిల్లాడు అద్భుతం ఇలానే పెద్దపెద్ద కలలు కంటూ ఉండు’ అంటూ స్పందించంది.ఇదే విషయాన్ని తెలుసుకున్న ఇమ్రాన్ హస్మి సైతం కూడా కాస్తా కొంటెగా సమాధానమిచ్చాడు.“ప్రమాణం చేసి చెబుతున్న.అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని” సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందించారు.

అయితే ఈ విషయం పై సదరు విద్యార్థిని యూనివర్సిటీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ రిజిస్టర్ రామకృష్ణ ఠాకూర్ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube