థియేటర్‌లో రిలీజ్ వద్దంటున్న హీరో.. ఎందుకో తెలుసా?

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ ఏడాదిలో భీష్మ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో, ప్రస్తుతం ‘రంగ్ దే’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు.

 Nithiin Wants Check Movie To Release In Ott, Nithiin, Rang De, Check, Ott, Tolly-TeluguStop.com

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను కూడా వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు ఈ హీరో.

విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ‘చెక్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

కాగా ఈ సినిమాను పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించింది.అయితే ఈ సినిమా ఔట్‌పుట్‌తో నితిన్ సంతోషంగా లేడని తెలుస్తోంది.దీంతో ఈ సినిమాను థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని నితిన్ అభిప్రాయపడుతున్నాడు.ఈ మేరకు చిత్ర నిర్మాతతో చర్చించినిట్లు తెలుస్తోంది.

చెక్’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడమే ఉత్తమమని నితిన్ సూచించాడట.

దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ‘చెక్’ చిత్ర యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టిందట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్‌లు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తుందా అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా నితిన్ నటిస్తున్న మరో సినిమా ‘రంగ్‌దే’ను అతి త్వరలో థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగత తెలిసిందే.మరి చెక్ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube