టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందన ఇప్పటికే తన మాతృభాష కన్నడంలో కూడా స్టార్ హీరోయిన్ అయిపొయింది.ఇక తమిళంలో సుల్తాన్ సినిమాతో ఘనంగా ఎంట్రీ ఇస్తుంది.
ఇక తక్కువ కాలంలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయి స్టార్ హీరోయిన్ ఫస్ట్ ఛాయస్ గా ఈ అందాల భామ మారిపోయింది.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పుష్ప సినిమాతో పాటు శర్వానంద్ సినిమా, అలాగే అఖిల్, సురేందర్ మూవీలలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే ఈ భామకి సౌత్ లో ఇప్పటి వరకు ఏ ఒక్క హీరోయిన్ కి రాని అరుదైన గుర్తింపు లభించింది.గూగుల్ అంతర్జాలంలో రష్మికకి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.
2020 సంవత్సరానికి గాను నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రష్మిక ఎన్నికైనట్టు ప్రకటించింది.గూగుల్ లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే, రష్మిక గురించిన సమాచారం కనిపిస్తోంది.
ఇండియాలో ఆమె ఎంతో పాపులారిటీని తెచ్చుకున్నారని, ఆమె దుస్తులు ఎంపిక చేసుకునే విధానం అందరినీ ఆకట్టుకుంటుందని, ఆమె ఇప్పుడు సరికొత్త లుక్ లో కనిపిస్తోందని వస్తోంది.
మొత్తానికి రష్మిక హిందీ ఒక్క సినిమా కూడా చేయకుండానే నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.ఇప్పటి వరకు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లకి రాని గుర్తింపు కనీసం పది సినిమాలు కూడా పూర్తి కాకుండానే రష్మిక తెచ్చుకోవడం నిజంగా గొప్ప స్ఫూర్తిదాయకం.తనకొచ్చిన గుర్తింపుపై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.