బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వేదికపై తన మాట తీరుతో, ఆటపాటలతో అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
బుల్లితెరపై రాములమ్మగా ఎంతో పేరు తెచ్చుకున్న శ్రీముఖి పటాస్ షో ద్వారా ప్రముఖ యాంకర్ గా మారిపోయింది.ఈ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీముఖి తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.
బిగ్ బాస్ ద్వారా శ్రీముఖి మరింత పాపులర్ అయ్యారు.అక్కడ ఎంతటి పాజిటివ్ ఇంపాక్ట్ ని సంపాదించుకున్నారో, అంతే రేంజ్ లో తన పై నెగటివ్ ఇంపాక్ట్ ను పడింది.
బిగ్ బాస్ తర్వాత కొద్ది రోజులు బుల్లితెరకు దూరంగా ఉన్నా శ్రీముఖి తిరిగి పటాస్ షో నుంచి తనకు ఆహ్వానం వచ్చినా అందుకు తిరస్కరించింది.కొద్దిరోజుల తర్వాత మ్యూజిక్ ఫ్రీ లోడెడ్ షో తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ షో అంతగా పాపులర్ కాకపోవడంతో కొద్దిరోజుల పాటు బుల్లితెరకు దూరంగా ఉన్నారు.
ఈ మధ్య కాలంలో బొమ్మ అదిరింది షో ద్వారా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి తనతో పాటు ఆ షో కూడా అదిరిపోయింది.ఈ షో ద్వారా తనలో ఉన్న కొత్తకోణాన్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.
దీపావళి పండుగను పురస్కరించుకొని సరిగమప సింగింగ్ ఐకాన్ సెలబ్రేషన్స్ లో శ్రీముఖి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ షోలో చంద్ర బోస్, ఎస్ పి శైలజ, కోటి న్యాయనిర్ణేతలుగా ఉండగా, ప్రముఖ సింగర్లు ఈ షోలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అయితే ఈ షో సింగింగ్ ఐకాన్ కావడంతో శ్రీముఖి కూడా దివాలి దీపాన్ని అనే పాటను పాడటంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.శ్రీముఖి పాటకు స్పందించిన కోటి గారు సింగర్ గా వచ్చి ఉంటే మిగతా సింగర్స్ ఎవరు కనపడకుండా ఉండేవారని, తన పై ప్రశంసల వర్షం కురిపించారు.
మొత్తానికి శ్రీముఖి తన గాత్రంతో గాయనిగా మారడంతో శ్రీముఖి లో ఇంత టాలెంట్ ఉందా… అని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.