ముంబై ఇండియన్స్ టీం ఓ ఛాంపియన్ టీమ్ లా ఐపీఎల్ లో ఆరోసారి ఫైనల్ కు చేరుకుంది.ఐదవ సారి కప్పును గెలుచుకునేందుకు తహతహలాడుతోంది.
తాజాగా జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది.ఇటు బౌలింగ్ లో, అటు బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించి రోహిత్ సేన ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ లో అడుగుపెట్టింది.
అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో అవకాశం ఉంది.నేడు జరగబోయే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారితో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడనుంది.
తాజాగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు మొదట్లో ఆచితూచి ఆడిన ఆ తర్వాత చివరి ఆరు ఓవర్లలో 92 పరుగులను సాధించి ఏకంగా 20 ఓవర్లు ముగిసిన సమయానికి 200 పరుగులను జోడించండి.అయితే ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనలో వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ముంబాయి పెసర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బూమ్రా ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తీశారు.
స్కోర్ బోర్డ్ మీద పరుగులు మొదలు అవకముందే 3 వికెట్లు నేలకూలాయి.ఇక నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో 57 పరుగుల భారీ విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ కు చేరుకుంది.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రిత్ బూమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులు ఇచ్చి 4 ప్రధాన వికెట్లు తీయడంతో అతనికి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది.
అలాగే ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో లో 14 ఓవర్ల వరకు ముంబై ఇండియన్స్ జట్టు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.చివరి 6 ఓవర్లలో ఆకాశమే హద్దుగా అన్నట్లు ముంబై ఇండియన్స్ జట్టు డాక్టర్స్ హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ సిక్సర్ల వర్షం కురిపించారు.
దీంతో ఆఖరి 6 ఓవర్లో ఏకంగా 92 పరుగులు రాబట్టారు.దీంతో ముంబై ఇండియన్స్ జట్టు భారీ టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది.
ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.చూడాలి మరి ఏ జట్టు ఫైనల్లో ముంబై ఇండియన్స్ తో పోరాడటానికి సిద్ధం కానుందో.