ప్రస్తుత సమాజంలో అడిగినది ఇవ్వకపోతే వారు ఎలాంటి వారైనా సరే వారిపై ఎటువంటి అఘాయిత్యానికైన పాల్పడుతుంటారు.ఎంతో ఆగ్రహంతో ఉన్న వారికి ఎదురుగా భార్య బిడ్డలు ఎవరు కనిపించరు.
ఎంతో మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ నిండు ప్రాణాలను బలి తీస్తున్నారు.ఈ తరహాలోనే తన భార్య కేవలం 200 రూపాయలు ఇవ్వలేదన్న కోపంతో ఏకంగా తన భార్యను చంపిన ఘటన తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు…గుంటూరు జిల్లాలోని, అమృతలూరుమండలం, యలవర్రు గ్రామంలో నివాసముండే మండే సామ్యేలు, ఎఫ్రాయమ్మ(90) దంపతులకు ఆరుగురు సంతానం ఉన్నారు.కానీ వీరిద్దరూ తమ బిడ్డల నుంచి వేరుగా ఉంటూ జీవనాన్ని గడుపుతున్నారు.
ఎఫ్రాయమ్మ కు ప్రభుత్వం ప్రతి నెల వృద్ధాప్య పింఛను అందిస్తోంది.ఆ డబ్బుతోనే వీరు జీవనోపాధిని సాగిస్తున్నారు.అయితే ఈ నెల ప్రభుత్వం అందించిన ప్రభుత్వ పెన్షన్ పొందిన ఎఫ్రాయమ్మ దగ్గర నుంచి తన భర్త కేవలం రెండు వందల రూపాయలు ఇవ్వమని అడిగాడు.200 రూపాయలను ఇవ్వడానికి ఎఫ్రాయమ్మ నిరాకరించడంతో అతని భర్త కోపంతో రగిలిపోయాడు.సాయంత్రం మద్యం సేవించి వచ్చిన సామ్యేలు ఎఫ్రాయమ్మ పై తీవ్ర కోపంతో రగిలిపోతూ నిద్రిస్తున్న ఆమె తలపై బలంగా కర్రతో బాదాడు.దీంతో ఎఫ్రాయమ్మ తలకు పెద్ద గాయమై, అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది.
ఎఫ్రాయమ్మ మృతిచెందడంతో సామ్యేలు అక్కడి నుంచి పరారయ్యాడు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
స్థానికులను విచారించగా గొడవపడిన విషయం తెలియడంతో తన భర్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.