అయ్యోయో.. ఫుట్ బాల్ కు, బట్టతలకు తేడా గుర్తుపట్టలేకపోయిన కెమెరా..!

మన భారతదేశంలో ఎక్కువగా క్రికెట్ ను క్రీడాభిమానులు ఆదరిస్తారు.అదే అమెరికా యూరప్ లాంటి దేశాలలో ఎక్కువగా ఫుట్బాల్ పోటీలు జరుగుతుండడం గమనిస్తూనే ఉంటాం.

 Oops A Camera That Cant Recognize The Difference Between Football And Baldness-TeluguStop.com

అందులోనూ యూరప్ దేశాలలో క్లబ్ సంస్కృతి చాలా ఎక్కువగా ఉంటుంది.ఆ దేశ ప్రజలకు ఫుట్బాల్ అంటే విపరీతమైన క్రేజ్.

అందుకే అక్కడ చిన్న మ్యాచ్ లు జరిగినా ప్రసారాల కోసం బ్రాడ్ కాస్టర్ లు వాటిని టెలికాస్ట్ చేస్తూ ఉంటాయి.ఇలా బ్రాడ్ కాస్ట్ చేసే సమయంలో వారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తుంటారు.

ఇందులో భాగంగానే ప్రస్తుతం ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏ క్రీడా సంబరం జరిగిన అక్కడ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

ముఖ్యంగా ప్రత్యక్ష ప్రసారానికి ఈ టెక్నాలజీని ఎంతగానో ఉపయోగిస్తున్నారు.

అయితే ఏ ఐ కెమరాలు నిర్దేశిత ప్రోగ్రాం కు అనుగుణంగా మ్యాచ్ ను వాటంతట అవే కవర్ చేస్తూ ఉంటాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా బంతి ఎటు వెళ్తే అటు కెమెరా యాంగిల్స్ ను సరి చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటుంది.

అయితే ఇటీవల స్కాట్లాండ్ దేశంలో జరిగిన ఓ ఫుట్బాల్ మ్యాచ్ లో మాత్రం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్యాలరీలో పై భాగంలో ఉన్న కెమెరా మ్యాచ్ కవర్ చేసే సమయంలో ఆట ఆడుతున్న బాల్ కు అలాగే లైన్స్ మెన్ బట్టతలకు తేడా తెలుసుకోలేకపోయింది.

దీంతో మ్యాచ్ జరుగుతున్న మొత్తం సమయంలో ఆ కెమెరా బంతిని చూపించకుండా ఎక్కువసేపు ఆ లైన్స్ మెన్ బట్టతలను ఫోకస్ చేస్తూ ఉంది కెమెరా.ఒకవైపు బాల్ కోసం పోటీపోటీగా పోరాడుతుంటే మరోవైపు కెమెరా మాత్రం ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి లైన్స్ మెన్ ను ఫోకస్ చేసింది.

అతడు ఎటు వైపు పరుగులు తీస్తే ఆ విధంగా కెమెరా ఫోకస్ చేస్తుంది.దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక తల పట్టుకున్నారు విశ్లేషకులు.

ఇకపోతే చివరకు తేలిన విషయం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా లైన్స్ మెన్ బట్టతలను ఫుట్ బాల్ గా భావించడంతో ఈ గందరగోళం నెలకొని ఉందని తేల్చారు.ఆ మనిషి తల నున్నగా, గుండ్రంగా ఉండే సరికి అతడి తలని బంతి అనుకొని కెమెరా అటువైపు కవర్ చేసింది అని తేలింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube