దక్షిణాది సినీ పరిశ్రమలో నటిగా పేరొందిన కలర్స్ స్వాతి తన పదహారేళ్ళ వయసులో ఉన్నప్పుడే కలర్స్ అనే టీవీ కార్యక్రమం చేసింది.అందులో నాగార్జున, ఉదయ్ కిరణ్, చియాన్ విక్రమ్ లాంటి స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేసి ఎంతో అద్భుతమైన పేరు సంపాదించింది.
ఇక ఆ షో చేసినప్పుడే స్వాతికి కలర్స్ స్వాతి అని పేరు వచ్చింది.అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది కలర్స్ స్వాతి.
కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్’ చిత్రంలో మొదటిసారిగా నటించిన స్వాతి ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,, అష్టా చమ్మ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు, మలయాళంలో నటించి గుర్తింపు పొందింది.
అష్టా చమ్మా చిత్రంలో 2008లో ఉత్తమ నటిగా నంది అవార్డు గెలుచుకుంది కలర్స్ పాప.
అదే సంవత్సరంలో వచ్చిన జల్సా చిత్రంలో హీరోయిన్ ఇలియానా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పింది.తను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు‘ సినిమాలో చేసింది.ఇక ఆ సినిమాలో నటించిన స్వాతిని ఎన్నో రకాలుగా అతని గురించి అడిగేవారట.
” రామ్ గోపాల్ వర్మకు ఆడవాళ్లు అంటే పిచ్చి అంట కదా! మీతో ఎలా ఉండేవాడు ఏమైనా అసభ్యంగా ప్రవర్తించేవాడా… అని మొహమాటం లేకుండా అడిగేవారట”.అలా అడగడం ఆమెకు ఇబ్బందిగా అనిపించేదట.
ఈ విషయంపై ఆమె మాట్లాడిన సమయంలో ”నాతో వర్మ గారు ఉన్నప్పుడు ఎన్నడూ కూడా అసభ్యంగా ప్రవర్తించలేదు, మాట్లాడలేదు.నన్ను చూసినప్పుడల్లా రేవతి గారు గుర్తొస్తారు అని అనేవారు.
నీకు చాలా టాలెంటు ఉందని, ఎక్కువగా ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండాలని సలహా ఇచ్చేవారు” అంటూ ఆమె తెలిపింది.