సాధారణంగా మనకు ఉక్కపోతగా ఉన్నప్పుడు కాసేపు అలా ఫాన్ స్విచ్ ఆన్ చేసుకుని సేదతీరాలని చూస్తాము.అలా ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరగకుండా ఏకంగా కింద పడితే ఎలా ఉంటుందో చెప్పండి? ఊహించుకుంటేనే ఎంతో భయంకరంగా ఉంటుంది కదు!! అచ్చం అలాంటి సంఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.ఆ ఘటన చూసిన వారంతా అయ్యబాబోయ్ అంటూ భయపడిపోతున్నారు.
నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోలో ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగానే, ఫ్యాన్ తిరగకుండా, ఏకంగా ఫ్యాన్ తో పాటు, ఆ ఇంటి సీలింగ్ మొత్తం ఊడి కింద పడడంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఫ్యాన్ కింద పడ్డప్పుడు సీలింగ్ కి ఫ్యాన్ అలాగే అతుక్కుని ఉంది.కేవలం రెక్కలు మాత్రమే ఒంగిపోయి కింద పడ్డాయి.
అదృష్టం ఏమిటంటే సీలింగ్ కింద పడినప్పుడు ఆ హాలులో ఎవరూ లేకపోవడం వల్ల ఎంతో పెద్ద ముప్పు తప్పింది.ఒకవేళ ఉండి ఉంటే ప్రాణాలు పోయేవి.
అంత దారుణమైన విచిత్రమైన ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.టైం చాలా బాగుందని, ఫ్యాన్ పడే సమయంలో కింద ఎవరూ లేకపోవడం ఎంతో అదృష్టమని ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
సాధారణంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో వినే ఉంటాం.ఫ్యాన్ కింద పడడం వల్ల మృతి చెందిన విషయాలు, షార్ట్ సర్క్యూట్ ఏర్పడి నష్టం జరిగిన సంఘటనలు ఎన్నో జరిగాయి.
కానీ, ఇలా ఫ్యాన్ కింద పడడంతో పాటు సీలింగ్ మొత్తం కింద పడడంతో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.ఒకవేళ అక్కడ ఎవరైనా మనుషులుంటే ప్రాణ నష్టం జరిగేదని ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరి మీరు ఓసారి ఈ వింత ఘటనను చూడండి!