హెచ్1బీ వీసాల జారీపై ఈ ఏడాది చివరి వరకు నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఉత్తర్వులను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఎన్నికల ముందు ఈ పరిణామాన్ని ఊహించని ట్రంప్.
అమెరికన్లను మచ్చిక చేసుకునేందుకు మరో ఎత్తు వేశారు.హెచ్ 1 బీ వీసా విధానంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.
ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఓ ప్రకటన విడుదల చేసింది.
అమెరికా కంపెనీలు 85 వేల మందికి మించి విదేశీ నిపుణులను తీసుకోకుండా నిబంధనలను తీసుకుని వచ్చింది.
కరోనావైరస్ కారణంగా దేశంలో ఉద్యోగ కల్పన భారమైనందున, వలసలను అరికట్టడం, స్థానికీకరణ, స్థానికుల ఉద్యోగులను రక్షించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు.ఈ కొత్త విధానం వల్ల అమెరికన్లకు మరింత మేలు కలుగుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.
నూతన వీసా విధానంతో అమెరికన్ సంస్థల్లో పనిచేయడానికి సంవత్సరానికి 85వేల మంది అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే నియమించుకునే వీలు కలుగుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాంట్ సెక్యురిటీ పేర్కొంది.హెచ్ 1 బీ వీసా విధానంలో అభ్యర్థుల ప్రత్యేక నైపుణ్యాల నిర్వచనాన్ని కూడా మార్చారు.ప్రత్యేక నైపుణ్యాల సంఖ్యను కూడా తగ్గించినట్టు తెలుస్తోంది.దీనిపై అమెరికా హోంశాఖ కార్యదర్శి చాడ్ వోల్ఫ్ స్పందిస్తూ, ఆర్థిక భద్రతతోనే దేశ భద్రత ముడిపడి ఉంటుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అమెరికా ప్రజలే అత్యధిక లబ్ది పొందేలా చట్టపరిధిలో వీలైనంతగా చేయాలి అని అభిప్రాయపడ్డారు.
ఈ నిర్ణయంతో ట్రంప్‌పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.