మరకత మాణిక్యంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు: మోహన్ బాబు

పెద్దరాయుడు అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే వ్యక్తి డైలాగ్ కింగ్, విలక్షణ నటుడు అయిన మోహన్ బాబు గారు.టాలీవుడ్ లో ఎన్నో సినిమాలో ఎన్నో విభిన్న కథలలో, నటుడిగా, విలన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

 Mohan Babu Birthday Wishes To Manchu Lakshmi Viral, Social Media, Manchu Lakshmi-TeluguStop.com

మోహన్ బాబుకి ముగ్గురు సంతానం అన్న విషయం మనకు తెలిసినదే.ముగ్గురు లో ఇద్దరు హీరోలుగా ఒకరు హీరోయిన్ గా నటిగా కొనసాగుతున్నారు.

మంచు కుటుంబం ఇండస్ట్రీకి కొత్త కాదు.అయితే మోహన్ బాబుకు తన కూతురు లక్ష్మీ ప్రసన్న అంటే ఎంతో ప్రత్యేకం అనేది చెప్పాల్సిన పని లేదు.

ఈ రోజు తన ముద్దుల కూతురు పుట్టిన రోజు సందర్భంగా మోహన్ బాబు గారు తనదైన శైలిలో తన గారాలపట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలను ఈ తెలిపాడు.ఆ పుట్టిన రోజు విషెష్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

అక్టోబర్ 8 1977లో జన్మించిన లక్ష్మీప్రసన్నకు ఈ రోజుతో 43 సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

తన ముద్దుల కుతూరిని మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న లాంటి ఒక వజ్రం వైడూర్యం, పుష్య గోమేధిక మరకత మాణిక్యం లాంటి నా కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, మరో జన్మంటూ ఉందో లేదు తెలియదు కానీ, ఒకవేళ ఉంటే లక్ష్మీ ప్రసన్న మరి నా కూతురుగానే, నేను తన తండ్రిగానే పుట్టాలని అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా లక్ష్మీప్రసన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

లక్ష్మీ ప్రసన్న మాట తీరుకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.గుండెల్లో గోదారి, అనగనగా ఒకదీరుడు వంటి చిత్రాలలో లక్ష్మీప్రసన్న నటించారు.అయితే ప్రేమతో మీ లక్ష్మి, మేము సైతం వంటి టీవీ షోల ద్వారా అభిమానులకు చేరువయ్యారు మంచు లక్ష్మి.ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా డైలాగ్ కింగ్ తో పాటు ఎంతోమంది సెలబ్రెటీలు ఆమె అభిమానులు విష్ ఆమెకు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube