డార్లింగ్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సినిమా తీయడానికి కథని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునేని ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.సుమారు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాత అశ్వినీదత్ పాన్ ఇండియా మూవీగా ఆవిష్కరించబోతున్నారు.
ఇదిలా ఈ సినిమాని భారీ తారాగణంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రానటువంటి కథాంశంతో తెరకెక్కించే ప్రయత్నం జరుగుతుంది.టైం ట్రావెల్ స్టోరీగా దీనిని నాగ్ అశ్విన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పని చేయబోతున్నారు.చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.
ఈ సినిమాకి స్క్రిప్ట్ మెంటర్ గా సింగీతం శ్రీనివాసరావు పని చేయబోతున్నట్లు తెలియజేశారు.ఇది తమకి ఎంతో గౌరవాన్ని ఇచ్చే విషయం అని, ఆయన సూచనలతో ప్రాజెక్ట్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు.
ఈ సినిమాకి సింగీతం స్క్రిప్ట్ మెంటర్ గా వర్క్ చేయబోతున్నారు అంటే ఇప్పటికే సినిమా కథ విషయంలో అతనితో చర్చించి ఉంటారు.ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితమే ఆదిత్య 369 ద్వారా టెక్నీకల్ వండర్ చూపించిన సింగీతం సలహాలు కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కి ఎంతో కొంత హెల్ప్ అవుతాయి.
ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న అతను కోలుకున్న వెంటనే చిత్ర యూనిట్ తో భాగం కావొచ్చని తెలుస్తుంది.