టిక్ టాక్ చైనా కి చెందిన యాప్ కావడంతో సదరు సంస్థ యాజమాన్యానికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి పలు దేశాలు.భారత్ –చైనా గొడవల కారణంగా భారత్ లో నిషేధించబడిన టిక్ టాక్ ని మెల్ల మెల్లగా దాదాపు అన్ని దేశాలు నిషేధంలో ఉంచాయి .
ఇక అమెరికాలోని ట్రంప్ టిక్ టాక్ ని ఉంచాలా తీసేయాలో అనే సందిగ్ధంలో అమెరికా ప్రజలు టిక్ టాక్ ని ఎంతో ఆస్వాదిస్తున్నారు కాబట్టి టిక్ టాక్ ని ఉంచాలి కానీ అంటూ కొన్ని కండిషన్లు పెడుతూ సదరు సంస్థకి టార్గెట్ ఫిక్స్ చేశాడు.దాంతో టిక్ టాక్ పై నిషేధం కంటే కూడా ట్రంప్ పెట్టిన కండిషన్లకు ఒకే చెప్పేసింది.దాంతో
అమెరికాలో టిక్ టాక్ సరికొత్తగా అమెరికన్స్ ముందుకు ఎంట్రీ ఇవ్వబోతోంది.అమెరికా ప్రభుత్వం టిక్ టాక్ పై కొన్ని వారాల పాటు విధించిన నిషేధాన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు.
అంతేకాదు ఈ నిషేధం పూర్తిగా నిలిచిపోనుందని కూడా తెలుస్తోంది.ఎందుకంటే అమెరికాలో తమ యాప్ కార్యకలాపాలు పూర్తిగా కొనసాగేలా చేయాలని సంస్థ యోచిస్తోంది.దాంతో యాజమాన్యం తీసుకునే ఈ నిర్ణయానికి పూర్తి సహకారం ఉంటుందని కూడా ట్రంప్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఈ క్రమంలోనే
టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్, ఒరాకిల్, వాల్ మార్ట్ , మూడు కలిసి అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలు సంయుక్తంగా చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది.
అంతేకాదు ఈ మూడు ప్రఖ్యాత కంపెనీలు కలిసి టెక్సాస్ కేంద్రంగా టిక్ టాక్ గ్లోబల్ పేరుతో మరో కొత్త సంస్థని నెలకొల్పనున్నాయని ప్రకటించాయి.ఈ పరిణామాలతో అమెరికాలో మరో 25 వేల ఉద్యోగాలు టిక్ టాక్ గ్లోబల్ ద్వారా రానున్నయాని ప్రభుత్వం తెలిపింది.
వ్యక్తుల యొక్క సమాచారాన్ని ఎంతో గోప్యంగా ఉంచడంలో కీలక ఆదేశాలు ఇచ్చామని కూడా ప్రభుత్వం ప్రకటించిది.