లాస్ట్ గాడ్ ఫాదర్ గా వస్తున్న షకలక శంకర్

జబర్దస్త్ కామెడీ రియాలిటీ షోతో కెరియర్ ప్రారంభించి టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు షకలక శంకర్.శ్రీకాకుళం బాష, యాసతో కామెడీ పండించే శంకర్ హీరోగా కూడా టర్న్ తీసుకొని సినిమాలు చేస్తున్నాడు.

 Shakalaka Shankar New Movie Last Godfather Launched, Vv Vinayak, Tollywood, Telu-TeluguStop.com

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.అతనిలో కామెడీ టైమింగ్ బాగుండటంతో హీరోగా కూడా ఆ ఈజ్ చూపిస్తూ పర్వాలేదనిపించుకుంటున్నాడు.

అలాగే కమర్షియల్ యాంగిల్ లో యాక్షన్ సన్నివేశాలు కూడా చేస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.అతను హీరోగా ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనేది పక్కన పెడితే తాజాగా శంకర్ మరో కొత్త సినిమాని హీరోగా స్టార్ట్ చేశాడు.
చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై షకలక శంకర్ హీరోగా, గాంధీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో వెలంపల్లి ప్రసాద్ లాస్ట్ గాడ్‌ఫాదర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలతో తాజాగా ప్రారంభం అయ్యింది.వివి వినాయక్ క్లాప్ కొట్టి సినిమా స్టార్ట్ చేశాడు.

ఈ సినిమాలో హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకుంటా అని శంకర్ ధీమా వ్యక్తం చేశాడు.త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.

మొత్తానికి లాక్ డౌన్ సమయంలో ఆర్జీవీ సినిమాలతో సందడి చేసిన శంకర్ ఈ సారి మంచి కంటెంట్ తో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.మరి ఈ సినిమా ఎంత వరకు అతనికి హీరోగా సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube