ఎన్నికల వేళ...దద్దరిల్లుతున్న అమెరికా...!!

అమెరికాలో ఒకపక్క అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇరు పార్టీల నాయకులు ప్రచారంలో తలమునకలై ఉంటే మరో పక్క జాత్యహంకార దాడుల వలన రేగుతున్న నిరసనలతో అమెరికా దద్దరిల్లుతోంది.నల్ల జాతీయులపై పోలీసుల వైఖరిపై నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

 In America Justice For Jacob, America, Jacob Blake, George Floyed, Blck People,-TeluguStop.com

పోలీసుల తీరుపై మండిపడుతూ రెండు రోజుల పాటు నిరవధికంగా నల్లజాతీయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. కేనోషా నగరంలో జాకబ్ అనే బ్లేక్ అనే నల్ల జాతీయుడిపై వరుసగా కాల్పులు జరిపి అతడి మృతికి కారణమైన పోలీసులని శిక్షించాలని నల్లజాతీయులు వీధుల్లోకి వచ్చారు.

ఐ కాంట్ బ్రీత్ అంటూ జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటన, ఆ తరువాత మరొక నల్లజాతీయుడు పై పోలీసుల కాల్పులు, మరో ఇద్దరు నల్లజాతీయులపై జరిగిన దాడుల తరువాత మళ్ళీ బ్లేక్ మృతి ఘటనతో అమెరికాలో జాత్యహంకారంపై వ్యతిరేకత పెరిగిపొతోంది .సెవెన్ బుల్లెట్స్ సెవెన్ డేస్ అంటూ నిరసన కారులు వందలాది మంది ప్రభుత్వానికి, పోలీసులకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.జస్టిస్ ఫర్ జాకబ్ అంటూ పెద్ద ఎత్తున బ్యానర్స్ , ఫ్లాకార్డ్స్ తో హోరెత్తించారు.

బ్లేక్ కి న్యాయం జరిగే వరకూ ఈ నిరసనలు కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించక పొతే మా నిరసనలు అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ ర్యాలీలో మృతి చెందిన బ్లేక్ తండ్రి కూడా పాల్గొన్నారు.బ్లేక్ హత్య జార్జ్ ఫ్లాయిడ్ హత్యలు క్రూరమైన జాత్యహంకారానికి నిదర్శనమని పోలీసుల ఈ వైఖరికి స్వస్తి చెప్పాల్సిందేనని బ్లేక్ సన్నిహితుడు, ఈ నిరసనలను ముందుండి నడిపిస్తున్న తాన్యా మెక్లీన్ ప్రకటించారు.

పోలీసుల వైఖరిపై మండిపడుతున్న తాన్యా వారిని శిక్షించి తీరాలని అప్పటివరకూ నిరసనలు ఆపే ప్రసక్తి లేదని హెచ్చరించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube