మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియాలో మూడో స్థానంలో రౌడీ స్టార్

టాలీవుడ్ లో తన ఇమేజ్ తో క్రేజీ హీరోగా దూసుకుపోతున్న కుర్ర హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.తన స్టైల్, మేనరిజమ్స్ తో అమ్మాయిల కలల రాకుమారుడుగా విజయ్ దేవరకొండ మారిపోయాడు.

 Vijay Devarakonda Stood In 3rd Place In Most Desirable Men, Tollywood, Bollywood-TeluguStop.com

హాట్ లుక్స్ తో ఈ జెనరేషన్ అమ్మాయిలు కోరుకునే విధంగా ఈ రౌడీ హీరో ఉండటంతో అతనికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.ఆ క్రేజ్ ని ఇప్పుడు నేషనల్ వైడ్ చేసుకోవడానికి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

పూరి తన హీరోని ఎలా ప్రెజెంట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అలాంటి దర్శకుడుకి రౌడీ స్టార్ లాంటి హీరో దొరికితే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ప్రేక్షకుల అంచనాకి వదిలేయాల్సిందే.

ఇదిలా ఉంటే రౌడీ విజయ్ తన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా జాబితాలో బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ లు మొదటి, రెండు స్థానాలలో నిలవగా మూడో స్థానంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు.

జాబితాలోని టాప్ 10లో టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ మాత్రమే ఉండటం గమనార్హం.మరే తెలుగు హీరో టాప్ 10లో స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు.గత ఏడాది రౌడీకి వరుసగా మూడు ఫ్లాప్ లు వచ్చిన కూడా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పడానికి ఈ గుర్తింపు చాలు.ఇదే గుర్తింపుతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోవడానికి మరింత అగ్రెసివ్ గా వెళ్తున్నాడు.

హాట్ నెస్ విషయంలో విజయ్ దరిదారుపలోకి మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్స్ కూడా రాలేకపోయారు.ఇక పూరి సినిమా తర్వాత ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వంద కోట్ల బడ్జెట్ తో విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా మూవీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ రెండు సినిమాలు హిట్ పడితే రౌడీ నేషనల్ స్టార్ గా మారిపోవడం గ్యారెంటీ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube