అమీర్ ఖాన్ పై పడ్డ కంగనా... మళ్ళీ సుశాంత్ ఇష్యూనే

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యని ఒక అవకాశంగా వాడుకొని కంగనా రనౌత్ తనకి విరోధులైన అందరి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తుంది.దానికి నెపోటిజం మీద పోరాటం అనే కలరింగ్ ఇస్తుంది.

 Kangana Ranaut Calls Out Aamir Khan, Sushant Singh Rajput, Nepotism, Bollywood,-TeluguStop.com

ప్రతి రోజు అదే పనిగా ఎవరో ఒకరిని కంగనా టార్గెట్ చేస్తూ ఉంటుంది.బంధుప్రీతిని యాడ్ చేస్తూ సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తుంది.

అయితే కంగనా వ్యవహారం శృతి మించిపోతూ ఉండటంతో చాలా మంది సినీ ప్రముఖులు ఆమెపై ఎదురుదాడి చేస్తున్నారు.అయినా కూడా తన పంథా ఇంతే అనే విధంగా ఆమె వ్యవహరిస్తుంది.

తాజాగా సుశాంత్ ఫ్యామిలీ లాయర్ కూడా కంగనా మీద ఘాటు వాఖ్యలు చేశారు.సుశాంత్ ఇష్యూని ఆమె తన వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటుందని, సొంత ఎజెండాతో వెళ్తుందని అన్నారు.

అయినా కూడా సుశాంత్ ఆత్మహత్య ఇష్యూని ఆమె వాడుకోవడం వదలలేదు.

తాజాగా సుశాంత్ ఇష్యూలోకి అమీర్ ఖాన్ ని లాగే ప్రయత్నం చేసింది.

అతని మీద మాటలతో దాడి చేసింది.సుశాంత్ మరణించి ఇన్ని రోజులు గడిచినా అమీర్ ఖాన్ ఎందుకు సంతాపాన్ని ప్రకటించలేదని ఆమె ప్రశ్నించారు.

పీకే సినిమాలో అమీర్ తో కలసి సుశాంత్ నటించాడని చెప్పారు.అమీర్ ఏమీ మాట్లాడకపోతే అనుష్క శర్మ, రాజు హిరానీ, ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీ వీరంతా కూడా ఏమీ మాట్లాడరని అన్నారు.

ఈ రాకెట్ ఒక ముఠాలా పని చేస్తుంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తోటి నటుడు చనిపోతే స్పందించని అమీర్ ఖాన్ టర్కీలో షూటింగ్ సందర్భంగా అక్కడి అధ్యక్షుడి భార్య నుంచి ఆతిథ్యం అందుకున్నాడని విమర్శించారు.

ఇప్పటికైనా ఈ విషయంపై అమీర్ ఖాన్ తన అభిప్రాయాన్ని చెప్పాలని సుశాంత్ ఆత్మహత్య ఘటనపై స్పందించాలని కంగనా డిమాండ్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube