భారత సంతతి మహిళ ఘనత: ఓ వైపు సైంటిస్ట్‌గా ప్రయోగాలు.. మరోవైపు క్రికెటర్‌గా రికార్డులు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన భారత సంతతి వ్యక్తులు పలు రంగాల్లో దూసుకెళ్తూ మన దేశం గర్వించేలా చేస్తున్నారు.ఇక పురుషాధిక్య క్రికెట్ ప్రపంచంలో మహిళల క్రికెట్‌కు ఇటీవలి రోజుల్లో కాస్తంత ఆదరణ పెరుగుతోంది.

 Indian Origin Anuradha Doddaballapur Take Four Wickets In Four Balls, Indian Ori-TeluguStop.com

కొందరు మహిళా క్రికెటర్లు పురుషుల కంటే తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు.తాజాగా జర్మనీలో స్థిరపడిన భారత సంతతికి చెందిన అనురాధ డొడ్డబళ్లాపూర్ అరుదైన ఘనతను సాధించారు.

వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించారు.తద్వారా మహిళా టీ20 క్రికెట్‌లో ‘‘ హ్యాట్రిక్ ప్లస్’’ వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సాధించారు.

జర్మనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈమె.ఆస్ట్రియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జర్మనీ జట్టు.వికెట్ నష్టపోకుండా 198 పరుగులు చేసింది.అనతరం 199 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రియా జట్టు అనురాధ దాటికి 61/9కే పరిమితమై 137 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Telugu Indianorigin, Nri-

ఆస్ట్రియా బ్యాటింగ్ సందర్భంగా ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన అనురాధ… రెండో బంతికి స్టిగ్లిట్జ్ (1)ని ఔట్ చేసి.అనంతరం వరుసగా కజాన్సి (0), అనీష (0), ప్రియా (0)లను ఔట్ చేసింది.4/4 గణాంకాల ద్వారా.శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ, ఆఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరసన అనురాధ చేరారు.టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 18 సార్లు ‘‘ హ్యాట్రిక్’’ నమోదైనా.ఇలా ఒక బౌలర్ 4 వికెట్లు పడగొట్టడం ఇది రెండో సారి.భారత్‌లోని కర్ణాటకకు చెందిన అనురాధ.గతంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) తరపున కూడా ప్రాతినిథ్యం వహించారు.అనంతరం సైంటిస్ట్‌గా మారిన ఆమె ప్రస్తుతం జర్మనీలో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఓ పక్క శాస్త్రవేత్తగా బిజీగా ఉంటూనే క్రికెట్ ఆడుతున్నారు అనురాధ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube