యాంటీ వైరల్ డ్రగ్ బ్లాక్ మార్కెట్ గుట్టురట్టు..!

దేశంలో కరోనా బారిన పడే వారి సంఖ్యా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.ఈ మహమ్మారి బారినపడి చాల మంది శ్వాస అందక వారి ప్రాణాలను కోల్పోయారు.

 Anti-viral Drug, Black Market, Task Police-TeluguStop.com

కొంత మంది ఈ క్లిష్ట పరిస్థితులను వారికీ అనుగుణంగా మార్చుకొని డబ్బులు సంపాదిస్తున్నారు.కొంత మంది యాంటీ వైరల్ డ్రగ్ బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈ వైరస్ తో బాధపడుతున్న వారి నుండి డబ్బులు ఉడాయిస్తున్నారు.

తాజాగా బ్లాక్ మార్కెట్ ద్వారా యాంటీవైరల్ డ్రగ్స్ అమ్ముతున్న మరో ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెహదీపట్నం లోని ఓ మెడికల్ షాప్ పై దాడులు చేసి మెడికల్ షాప్ ఓనర్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఓ మెడికల్ షాపులో బ్లాక్‌లో విక్రయిస్తున్న రెమ్‌డెసివిర్, కోవిఫర్ తదితర మందులను స్వాధీనం చేసుకున్నారు.యాంటీ వైరల్ డ్రగ్స్ బ్లాక్ అమ్ముతున్నారన్న సమాచారం మేరకు మెహదీపట్నంలోని ఓ మెడికల్ షాప్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

మెడికల్ షాప్ ఓనర్‌ని అదుపులోకి తీసుకుని విచారించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఇన్‌పేషెంట్ల వద్ద నుంచి యాంటీ వైరల్ డ్రగ్స్‌ని దొంగిలించి మెహిదీపట్నంలోని ఉన్న ఓ మెడికల్ షాప్‌కి అమ్ముతున్నట్లు తేలింది.

ఆలివ్ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ మెడికల్ బాయ్‌తో సహా మరో ఏడుగురు వ్యక్తుల ముఠాని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.నిందితులు రూ4,500 విలువ చేసే డ్రగ్‌ను బ్లాక్‌లో రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.నిందితులను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ ఆసిఫ్ నగర్ పోలీసులకి అప్పగించింది.పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube