ముఖం అందంగా, తెల్లగా మెరవాలని అందరూ కోరుకుంటారు.కాని, అందుకు భిన్నంగా మన చర్మం ఉంటుంది.
మొటిమలు, మచ్చలు, జిడ్డు చర్మం ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటాయి.అయితే ఎలాంటి చర్మ సమస్యలైనా శనగపిండి సులువుగా నివారిస్తుంది.
శనగపిండిని అత్యధికంగా భారతీయులు అనేక వంటల్లో ఉపయోగిస్తారు.శనగ పిండిలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
ఇతర పిండ్లతో పోలిస్తే శనగ పిండిలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది.
ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇక ఆరోగ్య విషయాలు పక్కన పెడితే.శనగపిండి ముఖానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక స్పూన్ శనగపిండి తీసుకుని అందులో.కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.అర గంట తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగడంతో పాటు.చర్మం తెల్లగా మారుతుంది.
అలాగే శనగపిండిలో పెరుగు, కలబంద గుజ్జు, రోజ్ వాటర్ మరియు కాఫీ పౌడర్ వేసి మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.అర గంట తర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చలు తగ్గుముఖం పడతాయి.మరియు ముఖం మృదువుగా కూడా మారుతుంది.
ఇక శనగపిండిలో చిటికెడు పసుపు మరియు పలు వేసి మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.అర గంట తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ట్యాన్‌ని తగ్గించి చర్మం జిడ్డుగా మారకుండా కాపాడతుంది.మరియు ముఖంపై ఉన్న ముడతలు పోయి.
యవ్వనంగా కూడా మారుతుంది.