ఎక్కువ విమానాలు నడపండి: కేంద్రానికి అమెరికాలో ఉన్న భారతీయుల విజ్ఞప్తి

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే.దీంతో వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.

 Vande Bharat Mission: Help Us Get Home, Urge Stranded Indian Students In America-TeluguStop.com

ఇందులో భారతీయులు మినహాయింపు కాదు.లాక్‌డౌన్‌కు ముందు వరకు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వివిధ మార్గాల్లో కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చి క్వారంటైన్‌లో పెట్టింది.

అయితే ఆ తర్వాత వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో భారత ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్ధితి.

ఈ నేపథ్యంలో మనదేశంలో లాక్‌డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం వందే భారత్ మిషన్ పేరుతో విదేశాల్లో ఉన్న మనవారిని స్వదేశానికి తీసుకొస్తోంది.

ఎయిరిండియా ప్రత్యేక విమానాల ద్వారా ఇప్పటికే వేలాది మందిని భారత్‌కు తీసుకొచ్చింది.అయితే కేంద్రం నడుపుతున్న విమానాలు పరిమితంగా ఉండటం.బాధితులు లక్షల్లో ఉండటంతో అవి ఏ మూలకు సరిపోవడం లేదు.దీంతో తమ వంతు వచ్చే వరకు వారు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్ధితి.

చివరికి ఏం చేయాలో తెలియని పరిస్ధితుల్లో ఎక్కువ సంఖ్యలో విమానాలను నడపాలని అమెరికాలో చిక్కుకున్న భారతీయులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Telugu America, Indian, Strandedindian, Vande Bharat-

ముఖ్యంగా మనవాళ్లు ఎక్కువగా ఉన్న హ్యూస్టన్, డల్లాస్, కాన్సాస్, లూసియానా, ఓక్లహోమా, టెక్సాస్, కొలరాడో, నెబ్రాస్కా తదితర రాష్ట్రాల్లో మరిన్ని డిపార్చర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.వీటిలో ఒక్క హ్యూస్టన్‌లోనే దాదాపు 30 వేల మంది భారతీయులు స్వదేశానికి రావడానికి ఎదురుచూస్తున్నారు.మరోవైపు లాక్‌డౌన్ కారణంగా అమెరికాలో విద్యార్ధులు, మెడికల్ టూరిస్టులు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వీరంతా తమను ఆదుకోవాల్సిందిగా భారత రాయబార కార్యాలయాల వద్ద బారులు తీరున్నారు.దీంతో అధికారులు సైతం మనవారిని స్వదేశానికి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఇదే విషయంపై కాన్సులేట్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు ప్రతిరోజూ 10 వేల దాకా ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే పరిస్ధితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.లక్షలాది మంది భారతీయులు తమను క్షేమంగా స్వదేశానికి చేర్చాలంటూ పేర్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు.

వందే భారత్ మిషన్‌లో భాగంగా అమెరికా నుంచి భారత్‌లోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్‌లకు భారతీయులను తరలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube