తెలుగులో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించినటువంటి “బంగారు బుల్లోడు” చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నటించినటువంటి బాలీవుడ్ ముద్దుగుమ్మ రవీనా టాండన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ చిత్రంలో స్వాతిలో ముత్యమంత అనే పాట మంచి హిట్ అయ్యింది.
అయితే ఈ అమ్మడు ఒకప్పుడు బాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.అయితే ఈ మధ్య కాలంలో కొంత మేర తన కుటుంబ పరిస్థితులను చక్క దిద్దుకునే పనిలో పడడంతో సినిమాల వైపు కొంతమేర దృష్టి తగ్గించినట్లు సమాచారం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రవీనా టాండన్ యాక్టివ్ గా ఉంటూ అందుబాటులో ఉంటుంది.
తాజాగా రవీనా టాండన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన అభిమానులతో ముచ్చటించింది.
ఇందులో భాగంగా అభిమాని అడిగినటువంటి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.కాగా ఓ నెటిజన్ “మిమ్మల్ని వచ్చే జన్మలో పెళ్లి చేసుకునే అవకాశం ఇస్తారా.?” అంటూ కామెంట్ చేశాడు.దీంతో రవీనా టాండన్ తనదైన శైలిలో స్పందిస్తూ “క్షమించండి… వచ్చే ఏడు జన్మల వరకు ఖాళీ లేదంటూ” సరదాగా రిప్లై ఇచ్చింది.
రవీనా టాండన్ ఇచ్చినటువంటి ఈ సమాధానాన్ని ప్రస్తుతం నెటిజన్లు సోషల్ మీడియాలో బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నటువంటి కేజిఎఫ్ చాప్టర్ 2 అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ పూర్తి కావడంతో ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో విడుదల తేదీపై కొంతమేర సందిగ్ధత నెలకొంది.