కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెకు అండగా నిలిచే 5 సూపర్ ఫుడ్స్ ఇవే!

ప్రస్తుత రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.రక్తంలో కొలెస్ట్రాల్( Cholesterol ) స్థాయిలు పెరిగే కొద్దీ గుండెకు ముప్పు పెరుగుతుంది.

 These 5 Super Foods Help Dissolve Cholesterol Details! Cholesterol, Superfoods,-TeluguStop.com

రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది.క్రమంగా మరెన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అందుకే అధిక కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఐదు సూపర్ ఫుడ్స్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.

ఈ ఐదు రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే అధిక కొలెస్ట్రాల్ కు సులభంగా చెక్ పెట్టవచ్చు.

ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది సిట్రస్ పండ్లు.

( Citrus Fruits ) నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్ సి రిచ్ గా ఉంటుంది.అందువల్ల ఇవి కొలెస్ట్రాల్ లో కరిగించి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో గ్రేట్ గా స‌హాయ‌పడతాయి.

స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని సైతం సిట్రస్ పండ్లు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Telugu Cholesterol, Citrus Fruits, Tips, Latest, Pumpkin Seeds, Superfoods, Turm

వాల్ నట్స్.( Walnuts ) వీటి ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ మన ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు.ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నవారు నిత్యం నాలుగు వాల్ నట్స్ తీసుకుంటే చాలా ఉత్తమం.

వాల్ నట్స్ లో ఉండే స్టెరాల్స్ కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా కలిగిస్తాయి.అదే స‌మ‌యంలో వాల్ నట్స్ లో ఉండే గుడ్‌ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి అండగా ఉంటాయి.

Telugu Cholesterol, Citrus Fruits, Tips, Latest, Pumpkin Seeds, Superfoods, Turm

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది ప‌డుతున్న‌వారు రోజుకు గుప్పెడు గుమ్మడి గింజలు( Pumpkin Seeds ) తినాలి.గుమ్మడి గింజలు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి హెల్ప్ చేస్తాయి.అలాగే మన శరీరానికి అనేక ముఖ్యమైన పోషకాలను చేకూరుస్తాయి.ప‌సుపు పాలుకు( Turmeric Milk ) కూడా కొలెస్ట్రాల్ లో కరిగించే సామర్థ్యం ఉంటుంది.రోజుకు ఒక గ్లాస్‌ ఆవు పాలల్లో పావు టీ స్పూన్‌ పసుపు వేసి మరిగించి తీసుకుంటే కొలెస్ట్రాల్ అన్న మాటే అనరు.

పైగా పసుపు పాలు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.

ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తాయి.ఇక కొలెస్ట్రాల్ ను కరిగించడానికి పుచ్చకాయ( Watermelon ) కూడా మనకు ఎంతగానో సహాయపడుతుంది.

రోజుకు ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను అధిక కొలెస్ట్రాల్ సమస్య దూరం అవుతుంది.గుండె ఆరోగ్యంగా, బాడీ హైడ్రేటెడ్ గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube