దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న ప్రాంతం ముంబయి.మహారాష్ట్ర మొత్తంగా కలిపి ఇప్పటి వరకు 14,541 కేసులు నమోదు అయ్యాయి.
అందులో ముంబయిలోనే మెజార్టీ అంటూ అధికారులు చెబుతున్నారు.ముంబయిలో పరిస్థితులు అదుపులోకి తీసుకు వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ప్రయోజనం మాత్రం శూన్యంగా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇవ్వక పోవడంతో ఏం చేయాలో పాలుపోక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేశిస్తోంది.
ముంబయి పరిస్థితి చెన్నైకు వస్తుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య అంతకు అంతకు పెరుగూనే ఉంది.ముఖ్యంగా చెన్నైలోని కోయంబేడు మార్కెట్ నుండి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియాలోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరు గాంచిన కోయంబేడు మార్కెట్ ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణం అయ్యింది.లాక్‌డౌన్ సమయంలో కూడా అక్కడ ప్రతి రోజు వేల మంది కూరగాయలు ఇతర అవసరాల కొనుగోలు చేసేందుకు వస్తున్నారు.
దాంతో పాజిట్ కేసులకు అక్కడ సంబంధం ఎక్కువగా ఉంటుంది.చెన్నై కరోనా కేసులు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.