దేశంలో అత్యధికంగా చేసింది ఏపీనే

దేశ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించింది ఏపీ అంటూ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో 74551 పరీక్షలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు.రాష్ట్రంలో 63 రెడ్‌ జోన్‌లు, 54 ఆరెంజ్‌ జోన్‌లు ఉన్నాయని పేర్కొన్నారు.559 మండలాలను గ్రీన్‌ జోన్‌లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు చేసిన పరీక్షల్లో కేవలం 1.61 మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

 Ap Cm Jagan Mohan Reddy Comments On Ap Is The Number One Place Corona Test's, Lo-TeluguStop.com

రాష్ట్రంలో 5 కోవిడ్‌ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశామని ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్బంగా జగన్‌ పేర్కొన్నారు.గత నెల రోజులుగా కరోనా టెస్టింగ్‌ సామర్థ్యంను రాష్ట్రం విపరీతంగా పెంచుకున్నామంటూ సీఎం వెళ్లడి చేశారు.

అత్యంత స్పీడ్‌గా పరీక్ష రిపోర్ట్‌ వచ్చేలా కిట్స్‌ తీసుకు వచ్చామన్నారు. అత్యాధునిక టెస్టింగ్‌ కిట్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లుగా చెప్పారు.తప్పకుండా త్వరలోనే కరోనాను అధిగమిస్తామంటూ సీఎం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube